యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రమిది. ఇటు చెర్రీ అభిమానులు, అటు తారక్ అభిమానులు ఇద్దరూ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే కీలక సన్నివేశాల కోసం విదేశాలకు వెళ్లిన చిత్ర బృందం తిరిగొచ్చింది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ స్వయంగా వెల్లడించారు.
రామ్‌చరణ్ కారులో వెళ్తూ.. ‘రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉదయం షూటింగ్ లకు రావడం ఎంతో బాగుంటుంది. మార్నింగ్ షూట్ ను నేను ఎంతో ఆస్వాదిస్తాను. లవ్ యూ’ అంటూ వీడియోను పంచుకున్నారు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించనున్నారు. షూటింగ్ ప్రారంభమై కొన్ని నెలలు కావొస్తున్నా, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయలేదు.
అయితే ఈ ఏడాది ముగింపు సందర్భంగా డిసెంబర్ 31న లేదా నూతన ఏడాదికి స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ రామ్ చరణ్, లేదా ఎన్టీయార్ కు సంబంధించిన ఏదో ఒక వార్తను విడుదల చేస్తోందని చిత్రపురి వర్గాల ద్వారా సమాచారం. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ కు జోడీగా ఆలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు కథానాయికను అన్వేషించే పనిలో ఉంది చిత్ర బృందం. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ 2020 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more