chima prema madhyalo bhama to be released in december ‘చీమ-ప్రేమ మధ్యలో భామ.!’ విడుదలకు సన్నాహాలు..

Chima prema madhyalo bhama to be released in december

chima prema madhyalo bhama to be released in december, chima prema madhyalo bhama, srikanth sri appalaraju, ss laxmi narayana, sp balasubramanyam, geeta madhuri, latest movie news, tollywood, movies, entertainment

Chima prema madhyalo bhama movie produced by SS Laxmi Narayana on magnam opus banner, directed by srikanth sri appala raju is set to be released in december.

‘చీమ-ప్రేమ మధ్యలో భామ.!’ విడుదలకు సన్నాహాలు..

Posted: 11/11/2019 09:12 PM IST
Chima prema madhyalo bhama to be released in december

మాగ్నమ్ ఓపస్ పతాకం పై మిస్టర్ ఇండియా, మిస్ తెలంగాణ అభ్యర్థులు అమిత్, ఇందు ప్రధాన పాత్రలలో శ్రీకాంత్ “శ్రీ” అప్పలరాజు దర్శకత్వంలో లక్ష్మీ నారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ”. ఇటీవల యస్ పి బాలసుబ్రమణ్యం గారు టైటిల్ సాంగ్ పాడారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ “చీమ – ప్రేమ మధ్యలో భామ!” డిసెంబర్ లో విడుదల అవుతుంది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో చీమ హీరోగా వస్తున్న మొదటి చిత్రం.

అలాగని ఇది పూర్తి ఏనిమేషన్ చిత్రం కాదు. మంచి కుటుంబ కథా చిత్రం. అందరూ చూడదగ్గ చిత్రం” అని తెలిపారు. సినీ దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ “మా చిత్రం యొక్క ట్రైలర్ విడుదలయింది. ఎవరో రాజమౌళి గారి ఈగను మా మాగ్నమ్ ఓపస్ చీమ తో పోల్చారు, అది గొప్ప ప్రశంశ!. రాజమౌళి గారి ఈగ రివెంజ్ స్టోరీ, మాది లవ్ స్టొరీ. నూతన నటులు అమిత్, ఇందు లను ఈ చిత్రం తో పరిచయం చేస్తున్నాము. డిసెంబర్ లో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles