Tenali Ramakrishna BABL to Release On Nov 15th ‘తెనాలి రామకృష్ణ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

Sundeep kishan s tenali ramakrishna babl gets ua censor certificate

Sundeep Kishan, Tenali Ramakrishna BA BL, censor formalities, Tenali Ramakrishna BA BL U/A certificate, G Nageswar Reddy, Vennela Kishore, Prabhas Seenu, Saptagiri, Hansika Motwani, Varalakshmi Sarat Kumar, Tollywood, movies, Entertainment

Sundeep Kishan’s comedy caper Tenali Ramakrishna BA BL has completed its censor formalities and it has been awarded U/A certificate. The film directed by G Nageswar Reddy is done with all the hurdles and the real entertainment begins from the 15th of this month.

‘తెనాలి రామకృష్ణ’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

Posted: 11/11/2019 08:01 PM IST
Sundeep kishan s tenali ramakrishna babl gets ua censor certificate

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంలో తనదైన శైలిలో కామెడీ ట్రాక్ లో నటించి.. హిట్ అందుకున్న సందీప్ ఆ తరువాత మళ్లీ అదే కామెడీ జోనర్ చిత్రంలో హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘యు/ఏ ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి ఈ కామెడీ ఎంటర్టైనర్ సన్నధం అవుతుంది.

ఇక గత కొంత కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సందీప్ కిషన్ ఎట్టకేలకూ ‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ అందుకున్నాడు. అయితే ఈ సారి సాలిడ్ హిట్ కోసం సందీప్ ఈ కామెడీ సినిమా చేస్తున్నాడు. హ‌న్సిక కథానాయకిగా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో నటించారు. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తుండగా అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డిలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ చిత్రంతో సందీప్ కిషన్ అంచనాలను ఏ మేరకు సఫలీకృతం అవుతాయో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles