Mahesh Babu's baby Sitara Turns Dubbing Artist సూపర్ స్టార్ ప్రిన్సెస్ సితార.. డబ్బింగ్ అర్టిస్ట్ గా..

Mahesh babu s daughter sitara to dub for baby elsa in telugu

frozen 2 telugu, sitara Ghattamaneni dub for elsa in frozen 2, mahesh babu daughter sitara, namrata shirodkar daughter sitara, frozen 2 release date, frozen 2 latest, frozen 2 telugu, Tollywood, movies, entertainment

Mahesh Babu and Namrata Shirodkar's 7-year-old daughter Sitara Ghattamaneni is all set to make her debut in the showbiz. Sitara will lend voice to the character of baby Elsa in the Telugu-dubbed version of Frozen 2.

డబ్బింగ్ అర్టిస్ట్ గా సూపర్ స్టార్ ప్రిన్సెస్ సితార..

Posted: 11/11/2019 06:51 PM IST
Mahesh babu s daughter sitara to dub for baby elsa in telugu

‘సూపర్‌స్టార్‌’ మహేష్ బాబు గారాల పట్టి సితార అచ్చంగా తండ్రి బాటలోనే పయినిస్తోంది. తన తండ్రి బాల నటుడిగా చిన్నప్పుడే వెండితెరపై విశ్వరూపాన్ని ప్రదర్శించగా, ఇప్పుడాయన తనయ సితార కూడా తన గళాన్ని వినపించనుంది. ఔనండీ నిజం. సితార డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారనుంది. ఏడేళ్ల ఈ చిన్నారి ఏకంగా హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పే అవకాశం దక్కించుకుంది.

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాత సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన ఫ్రోజెన్ 2 చిత్రంలోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పనుంది. దీనితో తమ సూపర్ స్టార్ మహేష్ కుమార్తె చిట్టి సితార వాయిస్ తెరపై విని ఆనందించాలని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చేస్తున్నారట. సితారతో ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పించి ఫ్రోజెన్ 2 తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలు మంచి ప్రచారం పొందారు.

సితార సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన క్యూట్ ఫొటోస్, లవ్లీ వీడియోస్ షేర్ చేస్తూ మహేష్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది వినాయక చవితి సంధర్భంగా మట్టి వినాయకుడ్ని పూజించాలని దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురితో కలిసి ఓ ప్రత్యేక వీడియో చేసింది. ఇక ఫ్రోజెన్ 2 మూవీ ఈనెల 22న విడుదల కానుంది. వారసత్వంగా వచ్చిన లక్షణాలు ఎక్కడికిపోతాయని మహేష్ బాబు ఫ్యాన్స్ సితారను కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh babu  superstar  gattamaneni sitara  dubbing artist  frozen-2  Tollywood  

Other Articles