The Family Man 2: Samantha to play a terrorist వెబ్ సిరీస్ లో సామ్.. హీరోయిన్ కాదట.. మరీ.?

Samantha akkineni a terrorist for family man

96, A Family Man, oh baby, Samantha, Samantha Akkineni, web series, terrorist, tollywood, Kollywood, Bollywood, movies, entertainment

Samantha Akkineni has recently signed a web series, which is going to be made in multiple languages. Now the role of Baby actress in this web series has been revealed. The shoot of Web series has already started and it is being made in Hindi, Telugu, and Tamil.

వెబ్ సిరీస్ లో అందాల అమ్మడు.. హీరోయిన్ కాదట.. మరీ.?

Posted: 11/11/2019 05:51 PM IST
Samantha akkineni a terrorist for family man

దక్షిణాదిన అగ్రనటీమణుల్లో ఒకరిగా స్థానం సంపాదించిన సమంత.. నటనకు ప్రాతినిధ్యం వున్న చిత్రాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే తన అభినయానికి స్కోమ్ వుండాలే కానీ.. ఎంతటి పాత్రనైనా.. ఎలాంటి పాత్రనైనా వేసి తన సత్తా చాటుతానని అంటున్న ఈ అమ్మడికి అలాంటి అవకాశమే వచ్చింది. అయితే అది సినిమాల్లో కాదు. వెబ్ సిరీస్ లో. తొలిసారిగా సామ్ వైవిద్యమైన పాత్రను పోషిస్తుంది. హీరోయిన్ పాత్రలకు మాత్రమే ఇన్నాళ్లు పరిమితమైన సామ్.. ఇక ఈ వెబ్ సిరీస్ తో లేడి విలన్ పాత్రలోనూ మెరువనుంది.

తొలిసారి నెగిటివ్ రోల్ లో సమంత నటించబోతొంది. దేశీయంగా మంచి ఆదరణ లభించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో సమంత కీలక పాత్రలో నటించనున్నట్లు స్పష్టమైంది. ఈ సిరీస్‌లో సమంత టెర్రరిస్టుగా కనిపించనున్నట్లు సమాచారం. మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఈ ఏడాది సెప్టెంబర్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమైంది. మొత్తం 10 ఎపిసోడ్లతో కూడిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పాపులర్ హిందీ వెబ్ సిరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ను తీస్తున్నారు. అదే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’.

ఇందులో సమంత నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉండటంతో నటనలో వైవిద్యం కోసం వెతికే సామ్ కు అడబోయిన తీర్థం ఎదురోచ్చింది. దీనికి తోడు ఆమె పోషించేది టెర్రరిస్ట్ పాత్ర కావడంతో ఆసక్తి మరింత పెరుగుతోంది. మొదటి సిరీస్ కు మించి ఈ రెండో సిరీస్‌ పాపులర్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. త్వరలోనే సమంత షూటింగ్ లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. హిందీతో పాటు తమిళం, తెలుగు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 96  A Family Man  oh baby  Samantha  Samantha Akkineni  web series  terrorist  tollywood  

Other Articles

Today on Telugu Wishesh