oka chinna viramam trailer launced ఆసక్తి రేపుతున్న ‘ఒక చిన్న విరామం’ ట్రైయిలర్..

Punarnavi oka chinna viramam trailer launced

Oka Chinna Viramam Trailer, Sanjay Verma, bigg boss telugu 3 contestant, Punarnavi Bhupalam, Garima singh, moonwalk entertainment, Sundeep cheguri, Bharath Manchiraju, Tollywood, movies, entertainment

BIg Boss Telugu season -3 lady monarch Punarnavi Bhupalam film Oka Chinnna Viramam Unit directed by sundeep cheguri had launched its trailer today.

ఆసక్తి రేపుతున్న ‘ఒక చిన్న విరామం’ ట్రైయిలర్..

Posted: 11/02/2019 12:52 PM IST
Punarnavi oka chinna viramam trailer launced

బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ లో లేడీ మోనార్క్ లా పేరుతెచ్చుకున్న కంటెస్టెంట్ పునర్నవి భూపాలం దీపావళికి రెండువారాల ముందు హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయినా అమె హౌజ్ లో ఇప్పటికీ హాట్ టాఫిక్ గానే మారింది. అదెందుకనో అందరికీ తెలిసిందే. అయితే అమె బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగుతున్న సమయంలో షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఓ శనివారం రోజున ఓ కప్పులో టీ తాగుతూ వచ్చాడు. దానిపై ఒక చిన్న విరామం అని రాసివుంది.

షోలో బ్రేక్ తీసుకునే సంరద్భంగా ఒక చిన్న విరామం అని చెప్పిన నాగ్.. తన చేతిలోకి కప్పును పునర్నవికి చూపిస్తూ.. చిత్రానికి సంబంధించిన టాపిక్ కూడా మాట్లాడాడు. అప్పటి నుంచి ఒక చిన్న విరామానికి మంచి పబ్లిసిటీ లభించింది. దీనికి తోడు ఎలిమినేట్ కాగానే చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ కావడం చిత్ర పబ్లిసిటీకి మంచి బూస్ట్ లభించింది. సందీప్ చేగూరి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ చిత్రం వైవిధ్యభరితమైన కథాకథనాలతో ప్రేక్షకుల మందుకు రానుంది.

ఈ చిత్రంలో సంజయ్ వర్మ, పునర్నవి, నవీన్, గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. భరత్ మంచిరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' బిగ్ బాస్ 3' ద్వారా పాప్యులర్ అయిన పునర్నవికి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో అన్నది వేచిచూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles