Actor Senthil cheated of Rs 15 lakh తమిళ హాస్యనటుడికి శఠగోపం పెట్టిన మేనేజర్..!

Kollywood comedian senthil kumar cheated of rs 15 lakh

actor Senthil kumar, Actor Senthil, kollywood comedian, actor senthil cheated of rs 15 lakh, sahayaraj cheats actor senthil, production manager, Sahayaraj, Cheating, Virugambakkam Crime Inspector, Nandini, Tamil Nadu, Kollywood, movies, Entertainment

The city police arrested a man who is alleged to have cheated actor Senthil of Rs 15 lakh. According to sources, the man identified as Sahayaraj (52) was arrested by Virugambakkam police for not paying the rent for a bungalow owned by Senthil.

తమిళ హాస్యనటుడికి శఠగోపం పెట్టిన మేనేజర్..!

Posted: 11/02/2019 01:44 PM IST
Kollywood comedian senthil kumar cheated of rs 15 lakh

పైన దగా, కింద దగా, కుడిఎడమల దగాదగా అన్న ప్రముఖ కవి శ్రీశ్రీ వ్యాఖ్యలు అందరికీ తెలిసినవే. అయినా మనవాడే కదా అనో.. లేక పరిచయస్తుడే కదా అనే వ్యక్తులను నమ్ముతాం. అదీ కాకపోతే అధిక ఆశకు వెళ్లి బొక్కబోర్లా పడతాం. ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కోన్నాడు తమిళ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కుమార్. తన చిత్రసీమకు చెందిన వ్యక్తే కదా అని నమ్మి ప్రొడక్షన్ మేనేజర్‌ కు తన ఫ్లాటును అద్దెకిస్తే.. నిట్టనిలువునా ముంచాడు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సాలిగ్రామంలోని భాస్కర్ కాలనీ 3వ వీధిలో ఉన్న ఓ అపార్ట్ మెంటులో మొత్తం రెండో ఫ్లోర్ కొనుగోలు చేశాడు హాస్యనటుడు. అందులో ఏకంగా పది ఫ్లాట్ వున్నాయి. 2013లో సినిమా ప్రొడక్షన్ మేనేజర్ సగాయరాజ్ ఆ అంతస్తును నెలకు రూ.2.60 లక్షల అద్దెకు తీసుకున్నాడు. తన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే కదా అని నమ్మి అద్దెకిచ్చాడు సెంథిల్ కుమార్. ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్న సగాయరాజ్ గత ఆరు నెలలుగా చెల్లించడం లేదు. దీంతో తనకు రావాల్సిన అద్దె కోసం సెంథిల్ కుమార్ ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.

అనుమానం వచ్చిన సెంథిల్ కుమార్ నేరుగా తన ఫ్లాట్‌కు వెళ్లగా అక్కడ వేరే వ్యక్తులు ఉన్నారు. వారిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సగాయరాజ్ ఈ అపార్ట్‌మెంట్‌‌ను తమకు లీజుకు ఇచ్చాడని, మరికొందరికి అద్దెకు ఇచ్చాడని చెప్పడంతో సెంథిల్ కుమార్ విస్తుపోయాడు. మోసపోయేవాళ్లు వుంటే మోసం చేసేవాళ్లకు కొదవేం లేదన్న నీతిసూక్తిని తెలుసుకున్న సెంథిల్ కుమార్.. సగాయరాజ్ పై విరుగంబాక్కమ్‌ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles