Anjali's cop avatar from Nishabdham released ‘నిశ్శబ్దం’ నుంచి అందాల అంజలి ఫస్ట్ లుక్ అదిరింది..

Anjali as maha crime detective agent nishabdham first look

sakshi, nishabdham, Maha, American cop, stylish look, anjali first look, anjali nishabdham, Anushka Shetty, Madhavan, Hemant Madhukar, character posters, Anthony, Tollywood, censor review, Tollywood, movies, entertainment

Actress Anjali, who’s known for adding a level of authenticity to films with her power-packed performances, will soon be seen in Nishabdham. After Anushka Shetty and Madhavan’s looks, Anjali’s first look from the film was released earlier today.

‘నిశ్శబ్దం’ నుంచి అందాల అంజలి ఫస్ట్ లుక్ అదిరింది..

Posted: 11/01/2019 08:04 PM IST
Anjali as maha crime detective agent nishabdham first look

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో పక్కింటి అమ్మాయిలా ముద్రవేసుకున్న అందాల అమ్మడు అంజలి చాలా గ్యాప్ తరువాత మళ్లి తెలుగు చిత్రంలో నటిస్తోంది. అభిన‌యంతో పాటు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టిస్తూ హీరోయిన్ గా త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అంజ‌లి. తాజాగా ఈమె `నిశ్శ‌బ్దం` చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాకు సంబంధించి అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌ను పోషిస్తున్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. సాక్షి అనే అమ్మాయిగా అనుష్క వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఆమె పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అలాగే సినిమాలో మ‌రో ప్ర‌ధాన పాత్రధారి మాధ‌వ‌న్ లుక్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. రీసెంట్‌గా సినిమా ప్రీ టీజ‌ర్ కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అంజ‌లి లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క శెట్టి, మాధ‌వ‌న్, అంజ‌లితో పాటు మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sakshi  nishabdham  Maha  Anushka Shetty  Madhavan  Hemant Madhukar  character posters  Anthony  Tollywood  

Other Articles