బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు సమయస్ఫూర్తి ఎక్కువని.. దాంతో పాటుగా హాస్య చతురత కూడా అదికమన్న విషయం తెలిసిందే. ఇలాంటి హాస్యానికి వెళ్లిన ఆయన తన సహచరి సోనాక్షి చేతిలో పరాభవానికి కూడా గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆయన తాజాగా నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం ప్రమోషన్లలో చోటుచేసుకోవడంతో.. ఆ వార్త కాస్తా వైరల్ అయ్యింది. ఆయన పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోట్టింది.
అయితే వాటన్నింటినీ పెద్దగా పట్టించుకోని అక్షయ్ తన చిత్ర ప్రమోషన్ పనిలో భాగంగా బిజీగా దేశంలోని ముఖ్యనగరాల్లో పర్యటిస్తూ మీడియా సమావేశంలో పాల్గోంటున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగా ఓ పాత్రికేయుడు స్టేజ్ మీద ఉన్నవారి మాటలను రికార్డ్ చేయాలని ఫోన్‌ను వారి ముందు పెట్టాడు. దాన్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాడు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హరీ మాట్లాడుతుండగా అది ఒక్కసారిగా మోగింది.
వెంటనే అక్షయ్ కుమార్ ఫోన్ తీసుకుని ‘హలో..మేం విలేకరులు సమావేశంలో ఉన్నాం. నేను అక్షయ్‌ను మాట్లాడుతున్నాను. ఇది పూర్తయ్యాక నేను ఫోన్ చేస్తాను’ అని మాట్లాడి ఫోన్ కట్ చేశారు. అక్షయ్ చేసిన పనికి అక్కడున్న వారందరూ కాసేపు ఆశ్చర్యపోయి తర్వాత నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు అక్షయ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, అక్షయ్ కుమార్ నటించిన ‘మిషన్ మంగళ్’ ఈ నెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, కీర్తి కుల్హరీ, నిత్యా మేనన్, తాప్సీ కీలక పాత్రలు పోషించారు.
(And get your daily news straight to your inbox)
Feb 18 | టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై జీహెచ్ఎంసీ అధికారగణం ప్రతీకారం తీర్చుకుందా.? అంటే ఔను అన్నట్టుగానే వున్నాయి చర్యలు. సాధారణంగా సినీమావాళ్లు.. అందులోనూ నటులుతో పాటు నిర్మాణరంగంలోనూ కొనసాగుతున్న వాళ్లు తమ... Read more
Feb 18 | వరుస హిట్లతో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని దూసుకుపోతున్నాడు. ఓ వైపు విజాయాల పరంపరం కొనసాగుతున్న కథాపరంగా చిత్రాలు నచ్చితేనే వాటిని అంగీకరిస్తూ ముందుకు అడుగులేస్తున్నాడు. తాజాగా 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల... Read more
Feb 18 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన తొలి వారంలో భారీ వసూళ్లను రాబట్టింది. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో కృతిశెట్టి, విజయ్ సేతుపతి, రాజీవ్ కనకాల... Read more
Feb 16 | బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. యువనటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడటంతో బాలీవుడ్ ఉలిక్కపడింది. టీమిండియా మాజీ రథసారధి మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధరారంగా తెరకెక్కిన ‘ఎంఎస్ ధోని’ ది... Read more
Feb 15 | మెగాప్యామిలీ నుంచి తాజాగా ఉప్పెన చిత్రంతో తెరంగ్రేటం చేసిన వైష్ణవ్ తేజ్ సినిమా.. కరోనా తరువాత బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సందడి చేస్తున్న చిత్రాల్లో ఒకటి. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఈ నెల ఫిబ్రవరి... Read more