Actor vimal controversial comments on heroine నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పై నటుడి అనుచిత వ్యాఖ్యలు

Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

Avtor vimal, vimal, hero, Heroine, varalaxmi sarathkumar, national award, audio launch, kollywood, entertainment, movies

Varalaxmi Sarathkumar, Vimal doing a new movie which is named as Kanni kashi. In this movie pramotions Vimal Commented On heroine Varalaxmi Sarathkumar.

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పై నటుడి అనుచిత వ్యాఖ్యలు

Posted: 08/14/2019 10:03 AM IST
Actor vimal drawsup controversy with his comments on varalaxmi sarathkumar

కాసింత సెలబ్రిటీ ఇమేజ్ వచ్చేసరికి తాము తప్పక వార్తల్లో నానుతూనే వుండాలనో.. లేక నోరుజారితే మాత్రం ఏమిటీ తప్పు అనుకుంటారో ఏమో తెలియదు కానీ.. వివాదాలకు తెరతీస్తుంటారు. ఈ సెలబ్రిటీల జాబితాలో రాజకీయ నేతల తరువాత సినీతారలే ఎక్కువగా ఇలాంటి కాంట్రవర్సీలకు తెరతీసి.. వివాదాలను రాజేస్తుంటారు. తమ తోటి నటీనటులతో తమకు అంత చనువు వుంటే.. సరదాగా ఇద్దరు వున్నప్పుడు చేసుకోవాల్సిన వ్యాఖ్యలు ఏకంగా మీడియా ముందు పెట్టి మరీ అగ్గిరాజేస్తారు.

ఇంకేముంది అదికాస్తా ఒక్కసారిగా వివాదానికి తెరతీయడంతో.. నాలుక జారిన విషయాన్ని వెంటనే కప్పిపుచ్చుకోవడమో.. లేక మీడియా వక్రీకరించిందని దానిపై తప్పును నెట్టడమో.. లేక ఔను.. అన్నాను కానీ తన ఉద్దేశ్యం అది కాదు అనో తప్పించుకోవడం కామన్. తాజాగాతమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ పై నటుడు విమల్ కూడా ఇలానే నోరు పారేసుకున్నాడు. ఇక మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు ఎదురుకాగానే తన ఉద్దేశ్యం అదికాదని అన్నాడు. అసలు విమల్ వరలక్ష్మీని ఏమన్నాడంటే..

ఆమెను ఓ మగాడిగా పేర్కొన్నాడు. తాను తొలిసారి ఓ మగాడితో నటించానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విమల్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆ వెంటనే తేరుకుని తన ఉద్దేశం అది కాదని, ఆమెతో కలిసి పనిచేయడంలో తాను ఎటువంటి ఇబ్బందికి గురికాలేదని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆమె చాలా సహజంగా నటిస్తుందని, ఆమె తన పాత్రలో లీనమైపోతారని విమల్ పేర్కొన్నాడు. వరలక్ష్మి తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ.. తనకు అసలు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. ముత్తుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘కాన్ని రాశి’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Avtor vimal  vimal  hero  Heroine  varalaxmi sarathkumar  national award  audio launch  kollywood  

Other Articles