తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.ఓ సినిమాను ఆయన అభిమానులను రుచించలేదనే చెప్పాలి. ఈ చిత్రం విడుదలకాగానే డివైడ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకాదరణ పొందడానికి కూడా చాలా కష్టించాల్సి వచ్చింది. అయితే రజనీ అభిమానులు తమిళనాడు తరువాత అంతటి పెద్ద సంఖ్యలో ఆయనకు అభిమానులున్నది మాత్రం చైనా అనే చెప్పాలి.
దీంతో ఆయన నటించిన రోబో 2.ఓ చిత్రాన్ని చైనా బాషలోకి తర్జుమా చేసిన చిత్ర నిర్మాణ వర్గాలు వచ్చే నెల 6వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో ఏముందు విశేషం అంటే.. సర్వసాధారణంగా భారత చిత్రాలు చైనాలోకి అనువాదం జరుగుతాయి కానీ ఇక్కడ విశేషమేమంటే.. రజనీ చిత్రం రోబో 2.ఓ మాత్రం చైనాలో రికార్డు స్థాయిలో విడుదల కానుంది. ఏకంగా 47,000 కంటే ఎక్కువగా త్రీడీ స్క్రీన్లపై రిలీజ్ అవుతుండడం గమనార్హం.
ఈ రేంజ్ లో చైనాలో రిలీజవుతున్న విదేశీ చిత్రం ఇప్పటివరకు మరొకటి లేదు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ, హెచ్ వై మీడియా సంస్థతో కలిసి 2.ఓ చిత్రాన్ని చైనాలో విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో రజనీకి జోడీగా అమీ జాక్సన్ నటించగా, ఎంతో కీలకమైన ప్రతినాయక పాత్రను బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పోషించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని జూలై 12నే రిలీజ్ చేయాలని భావించినా, హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ విడుదల నేపథ్యంలో వాయిదా వేశారు.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more