Prabhas and Shraddha romantic poster from Saaho సాహో’ నుంచి ప్రభాస్, శ్రద్దాల రొమాంటిక్ పోస్టర్..!

Saaho makers release prabhas shraddha kapoor s romantic and intimate poster

Saaho new poster released, Saaho, Prabhas Shraddha chemistry in Saaho, Prabhas, Shraddha Kapoor, Prabhas Shraddha romantic poster, Prabhas Shraddha intimate poster, movies, entertainment, tollywood

The makers of Saaho have finally released a romantic poster, which features an intimate moment between Prabhas and Shraddha Kapoor. This poster is now taking the social media by storm.

‘సాహో’ నుంచి ప్రభాస్, శ్రద్దాల రొమాంటిక్ పోస్టర్..!

Posted: 07/23/2019 02:45 PM IST
Saaho makers release prabhas shraddha kapoor s romantic and intimate poster

భాహుబలి చిత్రాల తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా.? అంటూ యంగ్  రెబల్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర నిర్మాణవర్గాలు.. మరో రెండువారాల పాటు తమ విడుదల తేదీని వాయిదా వేసుకుని ఆగస్టు 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక పోస్టర్లు, టీజర్లతో ఇప్పటికే అభిమానలలో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటుంది.

దీంతో 'సాహో' ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ కాగా, ఇప్పుడో రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రభాస్, శ్రద్ధాకపూర్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోని పలు భాషల్లో ఈ చిత్రాన్ని ఒకే రోజు విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

అయితే చిత్ర విడుదలను వాయిదా వేయడానికి గల కారణాలను చిత్ర నిర్మాణవర్గాలు ఇదివరకే స్పష్టం చేశాయి. అందుకు కారణం చిత్రంలోని గ్రాఫిక్స్ వర్క్స్ ఆలస్యమేనని చెప్పారు. ఇప్పటికే అభిమానులలో భారీ అంచనాలు వున్న ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచిపోతుందని సినీవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వున్న యంగ్ రెబల్ స్టార్ అభిమానులూ.. ఇక మీరూ సిద్దంకండీ.. ఆల్ ది బెస్ట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saaho  prabhas  shraddha kapoor  romantic poster  intimate poster  tollywood  

Other Articles