Mother Lakshmi donates kidney to Rana Daggubati రాణా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..

Baahubali actor rana daggubati reacts to kidney transplant rumours

Rana Daggubati, Rana Daggubati US, Rana Daggubati kidney transplant, rana daggubati kidney, mother lakshmi kidney donor, chicago, rana kidney condition, movies, entertainment, tollywood

Rana Daggubati was last seen in NTR Mahanayakudu, which released earlier this year. Last week, there were reports that the Baahubali star has a chronic kidney condition and that he was heading to the US to get a transplant.

రాణా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం..

Posted: 07/24/2019 07:08 PM IST
Baahubali actor rana daggubati reacts to kidney transplant rumours

బాహుబలి చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా భళ్లాలదేవుడి పాత్రలో మెరిసి యావత్ దేశసినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన దగ్గుబాటి రాణాకు కిడ్నీ మార్పడి శస్త్ర చికిత్స విజయవంతం అయ్యింది. ఆయన గత కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు జరిగిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయింది.

దగ్గుబాటి రాణా తల్లి కిడ్నీ ఇచ్చేందుకు ముందు రావడంతో ఆయనకు వైద్యులు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చేశారు. ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతం అయ్యిందని వైద్యులు తెలిపారు. గత ఏడాదిగా రానా హైదరాబాద్, ముంబైల్లో కిడ్నీ సమస్యకు చికిత్స పొందారు. అయితే, ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల కనిపించక పోవడంతో, అమెరికాలో చికిత్స పొందాలని భావించారు.

అక్కడ కూడా కిడ్నీ మార్చకుంటే లాభంలేదని తేల్చడంతో రాణాకు అది తప్ప ప్రత్యామ్నాయం లేదు. దీంతో కన్న బిడ్డ క్షేమం కోసం రానా తల్లి లక్ష్మి తన కిడ్నీ ఇచ్చేందుకు అంగీకరించారు. దీంతో చికాగో వైద్యులు నెల రోజుల పాటు రానాను అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్సలు చేస్తూ కిడ్నీని సక్సెస్ ఫుల్ గా మార్చారు. ప్రస్తుతం రానా విశ్రాంతి తీసుకుంటున్నారని తెలుస్తోంది. తదుపరి ఆయన 'విరాట పర్వం' చిత్రంలో నటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh