Akash alleges Puri copied his script for iSmart Shankar పూరి నా స్ర్కిప్ట్ కాఫీ కోట్టాడు: హీరో ఆకాష్

Hero akash alleges puri copied his script for ismart shankar

Ismart Shankar, Hero Akash. Tamil movie script, Telugu movie, puri jagannath manager, Ram potheneni, puri jagannadh, Radha, Non Yaar, entertainment, movies, tollywood

Tollywood hero Akash alleged that director Puri Jagannadh has made iSmart Shankar by copying his Tamil film script. He stated he tried to contact Jagannadh to inform him that the script was lifted from his movie.

పూరి నా స్ర్కిప్ట్ కాఫీ కోట్టాడు: హీరో ఆకాష్

Posted: 07/23/2019 11:52 AM IST
Hero akash alleges puri copied his script for ismart shankar

చాలా కాలం తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మంచి హిట్ కొట్టారు. రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమా వ్యక్తి మెదడును మార్పిడి చేయడమనే కాన్సెప్ట్‌తో రూపొందింది. అయితే ఈ కాన్సెప్ట్ తను తయారు చేసిన కథని  ‘ఆనందం’ ఫేమ్ ఆకాశ్ తెలిపాడు.

తానను హీరోగా పెట్టి రాధ అనే దర్శకురాలు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని.. అయితే తమిళంలో అనుకున్న విధంగానే ఈ చిత్రం విడుదలైందని, కానీ తెలుగులో మాత్రం కొంత జాప్యం జరగిందని అన్నాడు. అయినా దర్శకురాలు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్న క్రమంలో పూరి దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పూర్తిగా తమ చిత్ర కథతోనే తెరకెక్కడంతో తాము విస్మయానికి గురయ్యామని అన్నారు.

తమ చిత్రాన్ని తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ టైటిల్‌తో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆకాశ్ పేర్కొన్నాడు. దీంతో షాక్ కు గురైన తాను ఈ విషయమై దర్శకుడు పూరి జగన్నాథ్ ను  సంప్రదించేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదన్నాడు. తక్షణమే తమిళ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి, మీడియాను ఆశ్రయించామన్నాడు. సమస్య సామరస్యంగా పరిష్కారం కాకుంటే, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆకాశ్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ismart Shankar  Hero Akash. Ram potheneni  puri jagannadh  Radha  Non Yaar  tollywood  

Other Articles