Sahoo Postponed – Who Gets Affected? ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

Sahoo postponed who gets affected

sahoo, prabhas, shraddha kapoor, sujeeth reddy, Prabhas, Sahoo, Ranarangam, Sharvanand, Adavi Sesh, Evaru, cross link, ex-latest, New Movie, movies, entertainment, tollywood

The indications were there all along. It seemed like something was off with Saaho. Not that the makers showed intentions, but films around Saaho were making moves that made everyone suspicious.

ప్రభాస్ అభిమానులకు చేధువార్త.. సాహో విడుదలలో..!

Posted: 07/16/2019 09:39 PM IST
Sahoo postponed who gets affected

‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సాహో’. నేటితో ఈ సినిమాకు చిత్రబ‌ృందం గుమ్మడికాయ కొట్టేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే అభిమానులకు ఓ పిడుగులాంటి వార్త కలవరపెడుతుంది.

ఔనా అదేంటి.? ఏం జరిగింది.? అంటూ అప్పుడు అభిమానులు కలవరానికి గురవుతున్నారు. కానీ ఈ సినిమా విడుదల మరికొన్ని రోజులు ముందుకు వెళ్లింది. అంటే విడుదల తేది వాయిదా పడిందట. తొలుత ‘సాహో’ను ఆగస్ట్ 15న విడుదల చేస్తామని చెప్పినప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతుండటంతో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 30కి వాయిదా వేశారు.

ప్రస్తుతం ఈ సినిమా స్థానాన్ని యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రణరంగం’ చిత్రం ఆక్రమిస్తోంది. నిజానికి ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ‘రణరంగం’ విడుదలను చిత్రబ‌ృందం ఆగస్ట్ 15కు వాయిదా వేసింది. ఈ చిత్రంతో పాటు అడవి శేష్ హీరోగా నటిస్తున్న ‘ఎవరు’ సినిమా కూడా విడుదల కాబోతోంది. దీనిని బట్టి చూస్తే ఆగస్ట్ మొత్తం సినీ ప్రియులకు పండగలా కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sahoo  prabhas  shraddha kapoor  sujeeth reddy  prabhas. ex-latest  tollywood  

Other Articles