Miffed Jagapathi Babu walks out మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

Sarileru Neekevvaru, Mahesh Babu Jagapathi Babu, Prakash Raj, Anil Ravipudi, entertainment, movies, tollywood

Tollywood senior actor Jagapathi Babu, one of the most wanted baddies in the south Indian film circuit, is not a part of Mahesh Babu’s Sarileru Neekevvaru anymore. He has been replaced by Prakash Raj, claim sources.

మహేష్ బాబుకు జగపతి బాబు షాక్.!

Posted: 07/16/2019 08:34 PM IST
Jagapathi babu not part of mahesh babu s sarileru neekevvaru

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు సీనియర్ స్టార్లు కూడా నటిస్తుండటంతో.. ఈ సినిమాకు ఇప్పటికే అంచనాలు బారీగా పెరిగిపోతున్నాయి. దాదాపుగా దాశాబ్దమున్నరకాలం నుంచి రెండు దశాబ్దాల కాలం తరువాత మళ్లి తెరపై కనిపించేందుకు కూడా మహేష్ బాబు కోసం విజయశాంతి రెడీ అయ్యింది.

ఇలా అన్ని పనులు క్రమంగా సాగుతున్న సమయంలో సీనియర్ నటుడు, ప్రస్తుతం ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా బాగా రాణిస్తున్న జగపతి బాబు మహేష్ బాబుకు షాకిచ్చాడు. మహేష్ చిత్రం నుంచి ఆయన బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టు సమాచారం.

అయితే, జగపతిబాబు వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ చిత్రం ప్రస్తుతం కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రను మహేశ్ బాబు పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarileru Neekevvaru  Mahesh Babu Jagapathi Babu  Prakash Raj  Anil Ravipudi  tollywood  

Other Articles