pooja hegde to play a poor girl role పేదింటి అమ్మాయిగా బాహుబలి సరసన పూజా

Pooja hedge to join with prabhas in radha krishna direction

Prabhas, Baahubali, Sahoo, radhakrishna, jil, pooja hegde, august 15th, pongal 2020, prabhas in pongal race 2020, Krishnam Raju, UV Creations, Baahubali franchise, movies, entertainment, tollywood

Prabhas is planning to release his other film for Sankranthi 2020. The untitled period love story that is being directed by Radhakrishna Kumar of “Jil” fame has Pooja Hegde. The film is produced by Prabhas’s pedda nanna Krishnam Raju in association with UV Creations.

పేదింటి అమ్మాయిగా బాహుబలి సరసన పూజా

Posted: 12/26/2018 05:25 PM IST
Pooja hedge to join with prabhas in radha krishna direction

బాహుబలి చిత్రాలతో జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం 'సాహో' కోసం శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2019 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల కానుంది. కాగా, ఆ తరువాత మాత్రం ప్రభాస్ ఇంతలా గ్యాప్ తీసుకోకుండా సాహో తరువాత మరో ఐదు మాసాల్లోనే మరో చిత్రాన్ని తన అభిమానులకు అందించనున్నాడు.

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఒక షెడ్యూల్ షూటింగును కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమా 1960 కాలంనాటి ప్రేమకథగా రూపొందుతుందనీ, శ్రీమంతుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడనే వార్త ఇటీవలే బయటికి వచ్చింది. ఇక అలనాటి ప్రేమకథలో ప్రభాస్ ప్రియురాలిగా పూజా హెగ్డే నటించనుంది. ఈ చిత్రంలో పూజా పేదింటి అమ్మాయిగా కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ పేదింటి అమ్మాయి ప్రేమలో అంతటి శ్రీమంతుడు ఎలా పడతాడు? అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అనూహ్యమైన మలుపులతో కొనసాగుతూ ఈ కథ కట్టి పడేస్తుందని అంటున్నారు. యూత్ .. మాస్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. యాక్షన్ తో కూడిన ఈ ప్రేమకథను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Sahoo  radhakrishna  jil  pooja hegde  Krishnam Raju  tollywood  

Other Articles