Entho Fun from F2: Venky's Vintage Romance ఎఫ్-2 నుంచి వెంకీ మార్కు రొమాంటిక్ సాంగ్..

Entho fun from f2 venky s vintage romance

Entho Fun, F2 Video Songs, f2 first video song, f2 1st single, f2 movie songs, varun tej latest movie, f2 movie, venkatesh, varun tej, tamannah bhatia, mehreen, anil ravipudi, dil raju, dsp, devi sri prasad, f2 movie, latest movie news, Tollywood, movies, entertainment

Ravipudi’s comic outing F2: Fun and Frustration has been carrying huge expectations across Tollywood audience. Victory Venkatesh, Varun Tej, Tamannaah and Mehreen are the lead actors in this comic caper.

ఎఫ్-2 నుంచి వెంకీ మార్కు రొమాంటిక్ సాంగ్..

Posted: 12/26/2018 04:34 PM IST
Entho fun from f2 venky s vintage romance

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన 'ఎఫ్ 2' (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) సినిమా నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ని చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. ఈ చిత్రంలో వెంకీ మార్కు రొమాంటిక్ పాట వుందన్న విషయం రెండో పాట విడుదలతో అర్థమైపోయింది. ఇక వరుణ్ తేజ్ పై ఎలాంటి పాటను చిత్రీకరణ జరిగిందన్న అసక్తి కూడా అభిమానులలో రేకెత్తుతోంది.

తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. "స్వర్గమే నేలపై వాలినట్టు .. నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు .. గుండెలోన పూలవాన కురిసినట్టుగా .. ఎంతో ఫన్ .. ఎంతో ఫన్" అంటూ ఈ పాట కొనసాగుతోంది. ఈ పాట మేకింగ్ వీడియోకి సంబంధించిన దృశ్యాలపై ఈ వీడియోను కట్ చేశారు.

 వెంకటేశ్ .. తమన్నాలకి సంబంధించిన వేడుకలో సరదాగా .. సందడిగా సాగే గ్రూప్ సాంగ్ లా ఈ పాట వస్తుందనే విషయం అర్థమవుతోంది. వెంకటేశ్ .. తమన్నాలు ఈ వీడియోలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సాంగ్ ను అనిల్ రావిపూడి మంచి కలర్ ఫుల్ గా చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. తొలిసారిగా మల్టీ స్టారర్ చేస్తోన్న అనిల్ రావిపూడి .. హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : f2 movie  venkatesh  varun tej  tamannah bhatia  mehreen  anil ravipudi  dil raju  dsp  tollywood  

Other Articles

Today on Telugu Wishesh