Puri Jagannadh Ram Pothineni team up నెగిటివ్ రోల్ లో మెప్పించడానికి యువహీరో రెడీ..

Ram pothineni turns to negative role in puri jagannadh s next movie

Ram Pothineni next movie, Ram Pothineni Puri Jagannadh, Ram Pothineni villain role, Ram movies, Ram Pothineni negitive role, Ram Pothineni heroines, Director Puri Jagannadh, Love RAPO, Ram pothineni movie title, Puri Jagannadh next movie, movies, entertainment, tollywood

Tollywood hero Ram Pothineni, has been under pressure to prove at least one movie as a decent hit in recent days until 'Nenu Sailaja'. Now, the hero is all set to play a negative role in an upcoming movie with Puri Jagannath.

బ్యాడ్ బాయ్ గా మెప్పిస్తానంటున్న రామ్..

Posted: 12/26/2018 07:37 PM IST
Ram pothineni turns to negative role in puri jagannadh s next movie

సినిమాలలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కొనసాగుతుంటుంది. ఎందరో విలన్ పాత్రదారులు హీరోలుగా తెరపై ప్రేక్షకులను మెప్పించారు. అయితే ప్రస్తుతం మాత్రం రివర్స్ ట్రెండ్ కొనసాగుతుంది. హీరోలే విలన్ పాత్రలను ధరించి.. ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. బాహుబలి చిత్రంలో రాణా దగ్గుబాటి నుంచి ఈ ట్రెండ్ తాజాగా కొనసాగుతుంది. అయితే ఈ కోవాలోకి తాను వచ్చేస్తానని అంటున్నాడు యువహీరో రామ్.

యూత్ లో రామ్ కి మంచి క్రేజ్ వున్నా.. ఆయన నటించిన చిత్రాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. దాంతో మంచి కథకోసం వెయిట్ చేస్తూ గ్యాప్ తీసుకున్న రామ్, తాజాగా పూరి జగన్నాథ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా ఈ సినిమాను గురించి రామ్ ప్రస్తావించాడు. 'నన్ను మంచివాడిగా చూసి బోర్ కొట్టిందా .. అయితే ఇప్పుడు చెడ్డవాడిగా చూడండి' అంటూ పూరి .. ఛార్మితో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు.

బోల్డ్ కంటెంట్ తో ఈ సినిమా రూపొందనున్నట్టు రామ్ చెప్పాడు. ఈ సినిమాలో రామ్ కొత్తలుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. రామ్ కి ఇది 17వ సినిమా .. పూరి జగన్నాథ్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే కథానాయికలు ఎవరనే విషయాన్ని వెల్లడించనున్నారు. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే నమ్మకంతో రామ్ వున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Pothineni  Puri Jagannadh  villain  Charmi  Ram Pothineni next movie  tollywood  

Other Articles