‘ప్రేమ తో రా.. ప్రేమించుకుందాం రా.. పెళ్లి చేసుకుందాం.. ప్రేమింటే ఇదేరా.. కలిసుందాం రా..’ లాంటి ప్రేమ కథా చిత్రాలతో పాటు బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం, వంటి చిత్రాలతో విజయాలను అందుకుని విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో వెంకటేష్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విక్టరీ వెంకటేష్ సినిమాలు మాత్రమే తెలిసిన తెలుగు ప్రేక్షకులకు ఆయన కుటుంబం గురించి మాత్రం ఏమాత్రం తెలియదు.
ఆయన సోదరుడు దగ్గబాటి సురేష్ నిర్మాతగా, ఆయన తనయుడు రానా దగ్గుబాటి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు తెలిసినా.. హీరో వెంకటేష్ రియల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవడానికి కారణం వారు సినీరంగంతో చాలా దూరంగా వ్యవహరించడమే. అయితే సినిమా ప్రభావం మాత్రం ఇప్పుడు వెంకటేష్ తనయపై పడిందనే చెప్పాలి. రీల్ లైఫ్ లో తన ప్రేమను విజయం చేయడానికి తాను పడిన కష్టం తన తనయ మాత్రం పడకూడదని నిర్ణయం తీసుకున్నారు విక్టరీ వెంకటేష్..
అందుకనే ఆయన తన కూతురు రియల్ లైఫ్ లవ్ కు పచ్చజెండా ఊఫారు. దీంతో త్వరలోనే విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి పీటలెక్కబోతుంది. ఇంతకీ ఆశ్రీత ఎవరితో ప్రేమలో పడిందో తెలుసా.? బిగ్ షాట్ ఫ్యామిలిగా పేరొందిన హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడితో అశ్రిత గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పెద్దలు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
తాజాగా వెంకటేష్ అన్న సురేష్ బాబు.. సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెళ్లి ఖాయం చేసుకున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. అబ్బాయి తండ్రి రఘురామి రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంచి స్నేహితుడు కావడంతో త్వరలో అశ్రిత నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగున్నాయట. అయితే ఈ ప్రేమ వివాహంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఇరు కుటుంబం సభ్యులు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more