Trisha Trolled for Kissing in Public ఇక్కడ ఇలా.. అక్కడ అలా.. ఏంటీ త్రిషా

Actress trisha trolled for kissing dolphins in public

trisha trolled again, trisha online, trisha dubai vacation, trishe vijay sethupathi, trisha 96, south actress. trisha, trisha krishnan, peta, animals, dolphins, dubai vacation, troll, vijay sethupathi, kollywood, tollywood, movies, entertainment

Kollywood sensation Trisha shared her vacation photos with the fans, who in turn shared it through different accounts become viral. But there were also some negative comments that trolled Trisha.

పబ్లిక్ లో ముద్దుపెట్టిన ముద్దుగుమ్మకు నెట్టింట్లో షాక్.!

Posted: 09/22/2018 03:46 PM IST
Actress trisha trolled for kissing dolphins in public

దక్షిణాధి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకుని అందాల అమ్మడు.. అటు కాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో రమారమి అందరు అగ్రహీరోలతో నటించింది. ప్రస్తుతం తమిళనాట వరుస సినిమాలతో బిజీగా ఉన్న త్రిష.. ఇటీవలే దుబాయి పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఓ ఈతకోలనులో అమె పబ్లిక్ గా ముద్దుపెట్టేసింది. ఆ ముద్దు తాలుకు ఫోటోలను కూడా అమె స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేసింది.

ఒక్కసారి త్రిష ఫోటోలు బయటకు రాగానే అమె అభిమానులు సోషల్ మీడియాలోని వివిధ ఫ్లాట్ ఫాంల ద్వారా వాటిని షేర్ చేసుకున్నారు. ఇలా అమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అదే సమయంలో అమె తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. అదెలా అంటే అందుకు అమె ఫోటోలే కారణం. అదెలా అంటారా.. త్రిష దుబాయ్ లోని ఈతకోలనులో దిగి.. ముద్దుపెట్టిన ఫోటోలు చూసిన వారు అమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు.? అమె ఇంతకీ ఎవరికి ముద్దుపెట్టింది.? అన్న విషయానికి వస్తే..

త్రిష ముద్దుపెట్టింది డాల్ఫిన్లలకు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే. జీవ ప్రాణుల సంరక్షణ సంస్థ(పెటా)కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న త్రిష జలజీవాలను హింసిస్తుందా అంటూ ఆ సంస్థకు చెందిన వారు త్రిషపై మండిపడుతున్నారు. స్వేచ్ఛగా జీవించే డాల్ఫిన్లతో తన సరదాలు తీర్చుకోవడం ఏంటి..? అసలు వాటి స్వేచ్ఛను హరించే హక్కు ఆమెకు ఎవరిచ్చారు అంటూ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా నిర్వాహకులు పరిదా తంబల్ విమర్శించారు. మూగ జీవాలను వాటి మానాన జీవించనీయండి అంటూ పరిదా అన్నారు. పరిదా కామెంట్లను పలువురు నెటీ జనులు సమర్థిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : south actress. trisha krishnan  peta  animals  dolphins  dubai vacation  troll  vijay sethupathi  kollywood  

Other Articles