devadas first lyrical song out అందమైన బామ అంటున్న నాగ్

Devadas first lyrical song hey babu released

Hey Babu Lyrical song, Devadas, Nagarjuna, Nani, Rashmika, Aakanksha Singh, #Manisharma, #SriramAditya, #AshwiniDutt, #VyjayanthiMovies. tollywood, movies, entertainment

Aditya music which is officially having authorised rights of the movie devadas produced by vyjanthi productions, released its upcoming movie video lyrical song.

దేవదాస్ నుంచి తొలి పాట విడుదల

Posted: 09/17/2018 08:40 PM IST
Devadas first lyrical song hey babu released

మన్మధుడు చిత్రంలో అందమైన బామలు.. లేత మెరుపు తీగలు అంటూ పాట పాడి.. తన అభిమాన లోకాన్ని ఊర్రూతలూగించిన అక్కినేని నాగార్జున.. చేసిన ఓ ట్వీట్ అభిమానుల్లో అసక్తిని.. ఉత్కంఠకు తేరలేపింది. అదేంటంటే ఆయన ఇవాళ ఉదయం చేసిన ట్వీట్.. చాలా రోజుల తరువాత ఓ అందమైన అమ్మాయితో రొమాన్స్ చేసే అవకాశం తనకు దక్కిందని చమత్కరించడం అభిమానుల్లో అసక్తిని రేపింది.

ఇంతకీ ఆసక్తి దేని గురించంటారా.? అందమైన అమ్మాయి ఏవరూ.. అని.. అయితే దీనికి నాగ్ అక్కడే సమాధానం కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం నాగ్, నాని కాంబినేషన్ లో 'దేవదాస్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగ్ 'దేవ్' పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన తొలిసారిగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో ఆయన చాలా కాలం తరువాత మళ్లీ తనకు ఈ అవకాశం వచ్చిందని చమత్కరిస్తూ అభిమానుల్లో అసక్తిని రేపాడు.

సినిమాలో ఆకాంక్ష 'జాహ్నవి' పాత్రలో నటిస్తుండగా, ఆమెను పరిచయం చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టర్ ను విడుదల చేసిన నాగ్, "చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! యా... రొమాన్స్ ఎగైన్" అని వ్యాఖ్యానించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఉత్కంఠ ఎందుకంటూ.. సాయంత్రం ఏడు గంటలు ఎప్పుడు కోడుతుందా.? అంటూ అభిమానులను వెయిట్ చేయించారు నాగ్.

ఎందుకంటారా ఈ సినిమా పాట లిరికల్ వీడియోను సాయంత్రం విడుదల చేయనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు సాయంత్రం ఏడు ఎప్పడెప్పుడు అవుతుందా అంటూ వేచి చూసి.. హే బాబు అన్న పాట లిరికల్ సాంగ్, మేకింగ్ సన్నివేశాలను వీక్షించి.. పాట భలే బాగుందని కామెంట్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అదిరిందని.. దీంతో ఈ చిత్రంపై అంచనాలపె పెరుగుతున్నాయి కూడా కామెంట్లు చేస్తున్నారు. మరీ తెరపై హీరోయిన్లతో రొమాన్స్ ను పండించే నాగ్, ఆకాంక్షతో చేసే రొమాంటిక్ సన్నివేశాల గురించి తెలియాలంటే, ఈ నెల 27 వరకూ వేచి చూడక తప్పదు.

చాలా రోజులు తరవాత నా పక్కన ఒక అందమైన అమ్మాయి!! Yaayy romance again

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hey Babu Lyrical song  Devadas  Nagarjuna  Nani  Rashmika  Aakanksha Singh  tollywood  

Other Articles