Priya Varrier's song crosses one million views మరో పాటతో మళ్లీ ట్రెండ్ంగ్లో ప్రియా వారియర్

Priya varrier s song crosses one million views

Priya Prakash Varrier, Freak Penne Rap Song, Priya Prakash Varrier Songs, Oru Adaar Love, Oru Adaar Love Song, Freak Penne song, Shaan Rahman, Shaan Rahman Songs, Shaan Rahman Hits, Omar Lulu, Omar Lulu Movies, Roshan Abdul Rahoof, latest movie news, mollywood, movies, entertainment

The winking beauty of the internet, Priya Prakash Varrier is once again going viral online. She had shot to fame through the first song of Omar Lulu's latest directorial Oru Adaar Love.

మరో పాటతో మళ్లీ ట్రెండ్ంగ్లో ప్రియా వారియర్

Posted: 09/21/2018 06:32 PM IST
Priya varrier s song crosses one million views

ప్రియా వారియర్.. ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే ఇంటర్ నెట్ సెన్సెషన్ స్టార్ గా మారిన ప్రియా వారియర్ పతాక శీర్షికలకు ఎక్కిన విషయం తెలిసింది. ఈ కన్నుగీటే బామ మరోమారు కూడా వార్తల్లో నిలిచింది. మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటే సన్నివేశంతో కుర్రాకారును మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా అదే చిత్రానికి సంబంధించిన రెండో పాటలో మోడ్రన్ డ్రెస్ లో మెరిసింది. ‘ఫ్రీక్ పెన్నే’ అనే ర్యాప్ పాటలో ఆడిపాడింది.

ఒమర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నివేశాలు, పాటలు ఇప్పటి వరకు బాగానే ఆధరణ పొందాయి. ఈ ర్యాప్ సాంగ్ కూడా ఏకంగా మూడు మిలియన్ల మార్క్ చేరువలో వుంది. అయితే, తాజాగా విడుదలైన ‘ఫ్రీక్ పెన్నే’ పాటకు లైక్ లతో పాటు డిస్ లైకుల సంఖ్య కూడా పోటీ పడే రేంజ్ దాటిపోయి కొనసాగుతుంది. ప్రియా వారియర్ సాంగ్ కావడంతో ఈ వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా బాగానే ట్రెండవుతోంది.

అంతేకాదు, చాలామంది ఈ పాటను డిస్‌లైక్ చేయాలంటూ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ప్రియా వారియర్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ డిస్‌లైక్స్ వస్తున్నట్లు కామెంట్లను పరిశీలిస్తే తెలుస్తోంది. అలాగే, గత వీడియోల్లో ప్రియా వారియార్‌లో కనిపించిన మ్యాజిక్ ఈ పాటలో మిస్సయ్యిందని మరికొందరు భావిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. సాంగ్ మాత్రం చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా చిత్రించారు. ఈ ఏడాది క్రిస్ట్‌మస్ పురస్కరించుకుని ఈ సినిమా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : priya prakash varrier  Shaan Rahman  Oru Adaar Love  Omar Lulu  mollywood  

Other Articles