Krish and Ramya file for divorce విడిపోతున్న దర్శకుడు క్రిష్.. డాక్టర్ రమ్య..

Manikarnika director krish and wife ramya file for divorce

director, director krish, krsih, ramya, ramya velga, kirsh, manikarnika, kangana ranaut, Vedam, Gabbar Is Back, gautami putra shatakarni, tollywood, movies, entertainment

Director Krish, who is known for films like Vedam and Gabbar Is Back, tied the knot with Ramya Velaga in 2016. And in two years of marriage, the couple has chosen to call it quits.

విడాకుల కోసం ఫిటీషన్.. విడిపోనున్న దర్శకుడు క్రిష్ జంట..

Posted: 06/01/2018 05:57 PM IST
Manikarnika director krish and wife ramya file for divorce

టాలీవుడ్ లో మరో సంచలనం. అద్భుత చిత్రాల దర్శకుడు క్రిష్ ఇటు టాలీవుడ్ సహా అటు బాలీవుడ్ లో కూడా తన సత్తాను చాటుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయన దర్శకత్వ ప్రతిభకు తగ్గట్టుగా పలు ప్రతిష్టాత్మక చిత్రాల దర్శకత్వ బాధ్యతలకు కూడా ఆయన అందుకుంటున్న క్రమంలో ఆయన వేగానికి కళ్లేలు పడనున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. ఆయన కుటుంబంలో విభేదాలు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను విస్మయానికి గురిచేశాయి. రెండేళ్లలోనే ఆయన తన భార్య నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

క్రిష్ – రమ్య పరస్పర అంగీకారంతో.. ఇద్దరూ అనుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సినీ ఇండస్ట్రీ అంటోంది. కలిసి ఉండలేం అనుకున్నప్పుడు.. కలిసి విడిపోవటం మంచిదని.. అభిప్రాయాలు కలవనప్పుడు విడిపోవటమే బెటర్ అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావటంతోపాటు.. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గుసగుసలు ఎక్కువ అయ్యాయి. చాలా మంది ప్రముకులు కూడా క్రిష్ ను ఇదే అంశంపై ఫోన్ చేసి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించి.. ప్రచారానికి తెరదించాలని డిసైడ్ అయ్యారు.

బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ రూపొందిస్తున్న సమయంలో 2016లో ఆయన డాక్టర్ రమ్యను వివాహం చేసుకున్నారు. ఈ వెంటనే సినిమా షూటింగ్ బిజీలో పడ్డారు. ఆ మూవీ హిట్ తర్వాత.. హిందీలో కంగనారనౌత్ తో మణికర్ణిక ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆరు నెలలుగా అదే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టాడు. కుటుంబంతో కంటే.. సినిమాల్లోనే బిజీ అయిపోవటంతో భార్య రమ్యతో బేధాభిప్రాయాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చి.. విడిపోవాలని అనుకున్నారంట. ఆ క్రమంలోనే విడాకులకు కూడా అప్లయ్ చేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krsih  ramya  ramya velga  kirsh  manikarnika  kangana ranaut  Vedam  Gabbar Is Back  gautami putra shatakarni  tollywood  

Other Articles