Abhimanyudu take on Cyber Crimes తేలు కుట్టిన దొంగ ఏం చేస్తాడు..?

Abhimanyudu trailer vishal s take on cyber crimes

mass maharaj, nela ticket, ravi teja, malvika sharma, censor certificate, kalyan krishna, rajani talluri, ram tulluri, jagapathibabu, shreyas sriniwaas, shreyas media, movies, entertainment, tollywood

Telugu version of the movie Irumbu Thirai titled Abhimanyudu mounted up as Vishal and Samantha played the lead roles in the movie, directed by PS Mithran. Action King Arjun plays White Devil and is the lead antagonist in the movie.

తేలు కుట్టిన దొంగ ఏం చేస్తాడు..?

Posted: 05/30/2018 08:41 PM IST
Abhimanyudu trailer vishal s take on cyber crimes

యువ కథనాయకుడు విశాల్‌ హీరోగా నటించిన చిత్రం ‘అభిమన్యుడు’. తమిళంలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి మిథున్‌ దర్శకుడు. సమంత కథానాయిక. అర్జున్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. జూన్‌ 1న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘ఇరుంబితిరై’ టైటిల్‌తో ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ సినిమాకు అక్కడ ఘనవిజయాన్ని అందుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకు మరికొన్ని గంట్లల వ్యవధిలోనే రానుంది. విశాల్‌ సినీ కెరీర్‌లో బిగ్‌ హిట్‌గా నిలిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సైబర్‌ నేరాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏటీఎం మోసాలు మొదలుకొని ఆధార్‌ కార్డ్‌, డిజిటల్‌ ఇండియా సమస్యల వరకు పలు విషయాల్ని ఇందులో ప్రస్తావించారు. ‘సాధారణంగా మీకు కోపం ఎక్కువగా వస్తుంటుందా.. వీడికి కోపం మాత్రమే వస్తుంది..’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘ఒక మిలటరీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ అన్న సంగతి మర్చిపోయి ఎందుకయ్యా ఇంత ఎమోషన్‌ అవుతున్నావు..’ అని పై అధికారి విశాల్‌ను మందలిస్తున్నారు.

‘నాకు ఓ విషయం అర్థం కావట్లేదు. మిలటరీ వాడికి పాస్‌పోర్టు ఉంటుంది, రేషన్‌ కార్డు సరిగా ఉంటుంది. కష్టం అని మీ దగ్గరికి వస్తే లోన్‌ ఇవ్వమంటారు..’ అంటూ విశాల్‌ చెబుతున్నారు. ‘ఇంతకు ముందు జరిగిన యుద్ధాలన్నీ వెపన్ ‌వార్‌,‌ ఆ తర్వాత బయోవార్‌.. ఇప్పుడు సైబర్‌ వార్‌. నీతో సహా అందరు దొంగలు.. నేను తేలు, నేను కుడితే మూసుకుని ఉండాలి’ అంటూ ట్రైలర్‌లో అర్జున్‌ తన విలనిజాన్ని పండించారు. ఇలా ఆసక్తికర సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishal  samanta  abhimanyudu  Irumbu Thirai  action king arjun  mithran  trailer  tollywood  movies  entertainment  

Other Articles