Allu Arjun Gave Me Five Lakhs Like A God -Posani దేవుడే అల్లు అర్జున్ రూపంలో సాయం: పోసాని

Allu arjun gave me five lakhs like a god posani

Posani Krishna Murali, Allu Arjun, Poor Students, Telugu Heroes, movies, entertainment, tollywood

Maybe I've to say that God came in the form of Allu Arjun to help these kids, said renowned director, writer and actor posani krishna murali. His cheque and thought inspired me to help these kids" he added.

దేవుడే అల్లు అర్జున్ రూపంలో సాయం: పోసాని

Posted: 06/01/2018 07:49 PM IST
Allu arjun gave me five lakhs like a god posani

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులకు స్పందించే హృదయంతో పాటు సాయం చేసే చేతులు కూడా వున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందరో హీరోలు తమ అభిమానుల కోరికలను గొప్యంగా తీరుస్తున్న విషయం కూడా వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నా అంటూ వచ్చిన వారిని అదుకునేవారిలో ఒకడిగా నిలిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి ఇప్పటికే 15 మంది పేదలకు హార్ట్ సర్జరీలు చేయించారు. ఎందరినో ఎన్నో విధాలుగా అదుకుంటూ వారికి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో పదో తరగతి పరీక్షా ఫలితాలలో 95శాతానికి పైగా మార్కులు సాధించిన ముగ్గురు సరస్వతీ పుత్రికలకు లక్ష్మీ కటాక్షం కూడా పొందాలని ఆయన అకాంక్షిస్తూ వారికి ఒక్కొక్కరికి లక్ష యాభై వేల నగదును సాయం చేశారు. అంతేకాదు కాలేజీలకు వెళ్తున్నారు.. మంచి బట్టలు వేసుకుని వెళ్లాలని చెప్పి మరో పది వేల రూపాయలను కూడా అదనంగా అందించాడు. రూ. లక్షన్నరే ఎందుకు ఇచ్చడని మీ సందేహం. అయితే తన వద్దకు వచ్చిన ఈ బాలికలు తమ చదువుల కోసం లక్షన్నర కావాలని ఆయనను అడిగారు.

ఈ సందర్భంగా పోసాని తనకు ఈ డబ్బు ఎలా వచ్చిందన్న విషయం కూడా చెప్పాడు. ఒక రోజు తనను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి రమ్మని చిన్న పనివుందని పిలిచాడు. తాను ఎక్కడా బన్ని గురించి నోరు జారలేదు కదా.? అయినా నన్ను పనుందని ఎందుకు పిలుస్తున్నాడని ఆయన మదిని తొలుస్తుంది. ఇంతలో ఆయన ఇంటికి వెళ్లగానే.. సార్, గత ముఫై ఏళ్లుగా మీరు చిత్రపరిశ్రమలో వున్నారు కదూ.. అనేక మందికి సాయం కూడా చేస్తున్నారు. కొందరికి అరోగ్యపరంగా, మరికొందరికి అర్థికంగా.. చాలా బాగుంది.

అయితే ఇది తీసుకోండి ఇది మేము మీకు ఇస్తున్న కానుక. దీనికి నో అని మాత్రం చెప్పకండీ అన్నారు. బన్ని అంతలా చెపేసరికి తన నోట మాట కూడా రాలేదని అన్నారు. అయితే ఇంతకీ కవర్ లో ఏముందని చూస్తే ఓ చెక్కు వుంది. అక్షరాలా ఐదు లక్షల రూపాయల చెక్కు. ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసిన తరువాతే ఈ ముగ్గురు సరస్వతులు నన్ను కలిశారు. దీంతో ఈ ముగ్గురికి సాయం చేయడానికి దేవుడే అల్లుఅర్జున్ రూపంలో వచ్చాడేమోనని పోసాని అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Posani Krishna Murali  Allu Arjun  Poor Students  Telugu Heroes  movies  entertainment  tollywood  

Other Articles

Today on Telugu Wishesh