Mallika Sherawat on India becoming ‘land of gang rapists’! రాఖీ తరువాత మల్లికా.. సంచలన వ్యాఖ్యలు

After rakhi sawant now its mallika sherawat on rapes in india

bollywood actress, Rakhi Sawant, Asaram, potential predetor, unnao, kathua, asifa, social media, women, girl child, rapes, sexual assaults, gang rapes, crime against women, crime against girls, crime

After Controversial actress Rakhi Sawant it's now mallika sherawat who made sensational comments on India becoming ‘land of gang rapists’!. Hisss actress has expressed her displeasure over increasing number of rape cases in India.

రాఖీ తరువాత మల్లికా.. సంచలన వ్యాఖ్యలు

Posted: 04/28/2018 02:45 PM IST
After rakhi sawant now its mallika sherawat on rapes in india

బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి. మల్లిక కథానాయికగా నటించిన చిత్రం ‘దాస్‌ దేవ్‌.’ సినిమా స్పెషల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించిన అనంతరం అమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో అమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

‘దేశంలో చిన్నారి బాలికల పట్ల, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు సిగ్గుచేటు. అహింస పరమోదర్మహా అంటూ మహాత్మాగాంధీజీ తిరుగాడిన ఈ భారతావనిలోనే మగమృగాళ్లకు అలవాలంగా మారిందని, భారతదేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారిందని అమే తీవ్ర అందోళనను వ్యక్తం చేసింది. తాను ప్రతిరోజు దినపత్రికలలో ఇలాంటి వార్తలను చూడటం తనకే బాధాకరంగా మారిందని అమె అవేదన వ్యక్తం చేసింది.

ఇలాంటి సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారని. ఈ విషయంలో మీడియానే ఏదో ఒకటి చేయగలదని అమె విశ్వాసం వ్యక్తం చేశారు. మీడియా లేకపోతే కథువా, ఉన్నావ్‌ లాంటి కేసులు బయటికి వచ్చేవే కావని అన్నారు. మీడియా తెచ్చిన ఒత్తిడి కారణంగానే మైనర్లపై అత్యాచారాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలన్న కొత్త చట్టం కూడా వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఇందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood actress  Rakhi Sawant  Mallika Sherawat  unnao  kathua  asifa  India  land of gang rapists  crime  

Other Articles