Ram Charan Selling Ice Creams For Memu Saitham Show మేముసైతం అంటూ చెర్రీ కాంట్రీబ్యూషన్.. ఎంతో తెలుసా.?

Ram charan donates rs 30 lakhs for kids in memu saitham second season

Ram charan, Mega Power Star Ram Charan, memu saitam, manchu lakshmi, donation, Ram Charan special episode, Lakshmi manchu, Ram Charan Memu Saitham 2, Ram Charan sell buttermilk lassi, Ram Charan sell juice, Rangasthalam actor support children, tollywood, movies, entertainment

mega power star Ram Charan has recently shot a special episode for Lakshmi Manchu's Memu Saitham 2, which features him selling buttermilk, lassi and juice and contributed Rs 30 Lakhs for kids.

మనస్సున్న మారాజు మా రాంచరణ్.. మేముసైతంలో రూ.30లక్షల విరాళం..

Posted: 04/27/2018 06:51 PM IST
Ram charan donates rs 30 lakhs for kids in memu saitham second season

తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో అనేక కార్యక్రమాలు వస్తున్నా.. వారంతంలో వచ్చే కార్యక్రమాలకు మంచి టీఆర్పీ రేటింగ్ లు ఎక్కువ. ఇంటిల్లిపాది అంతా కలిసి ఓ కార్యక్రమాలను చూసేది అప్పుడే కదా. అయితే ఇలా వచ్చే అనేక కార్యక్రమాలలో గేమ్ షోలు.. రియాల్టీ షోలు, కామెడీ షోలు ఎన్నున్నా.. మన్సున్న మారాజులు, మారాణులు అందరూ కలసి చూసేది మాత్రం మంచు లక్ష్మి నిర్వహించే మేముసైతం కార్యక్రమమే అన్నది జగమెరిగిన సత్యం. ఈ కార్యక్రమంలో అనేకమంది సెలబ్రిటీలు.. స్టార్లు.. తమ వంతుగా ఆపన్నులను ఆదుకునేందుకు ముందుకువస్తున్నారు.

తొలిదశను ముగించుకున్న మేము సైతం రెండో సీజన్ కూడా రెడీ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హజచై తమవంతు సాయాన్ని అందించిన విషయం కూడా తెలిసిందే. కాగా తాజాగా వస్తున్న రెండో సీజన్లో చిట్టిబాబు అదేనండీ మన మెగా పవన్ స్టార్ రాంచరణ్ తేజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రామ్  చరణ్ కూడా మేము సైతం అంటూ తన వంతు సాయం అందించాడు. ముందుగా గీతాంజలి ఇంజినీరింగ్ కాలేజ్ లో రామ్ చరణ్ తో షో చేయాలనుకున్నా.. పరీక్షల నేపథ్యంలో అది సాధ్యం కాక హైదరాబాద్ రోడ్లపై షూట్ చేశారు.

మనలాంటి వారు గత్యంతరం లేక మండుతున్న ఎండల్లో కష్టపడతాం. కానీ ఏసీ కార్లు.. సెంట్రల్ ఏసీ ఇళ్లలో వుండే చెర్రీ.. కేవలం సామాజిక సేవ కోసం మండుటెండలో ఐస్ క్రీమ్ లు, పుదినా జ్యూస్, బటర్ మిల్క్ అమ్మాడు. ఇంత చేసిన చెర్రీ చాల్లే అనుకోలేదు. ఆ కార్యక్రమంలో చిన్నారుల అభివృద్ది కోసం తన  వంతుగా రూ. 30 లక్షలను కూడా కాంట్రిబ్యూట్ చేసి తన మనస్సు వెన్నలా ఎంత స్వచ్చమైనదో తెలిపాడు. ఔనా అంటున్నారు కదూ.. ఈ ఎపిసోడ్ త్వరలోనే జెమిని టీవీలో ప్రసారం కానుంది. అప్పటి వరకు అగాల్సిందే మరీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles