Naa Peru Surya Theatrical Trailer released అంచనాలను పెంచిన ధియేట్రికల్ ట్రైయిలర్

Naa peru surya naa illu india trailer allu arjun goes on a rampage

naa peru surya naa illu india trailer, watch naa peru surya naa illu india trailer, allu arjun film, allu arjun news, allu arjun naa peru surya naa illu india, naa peru surya naa illu india story, naa peru surya naa illu india trailer, naa peru surya trailer, allu arjun, anu emanuel, movies, tollywood, entertainment

Naa Peru Surya Naa Illu India trailer: Allu Arjun's upcoming film marks the directorial debut of screenwriter Vakkantham Vamsi. Anu Emmanuel plays the female lead.

అభిమానుల్లో అంచనాలను పెంచిన ధియేట్రికల్ ట్రైయిలర్

Posted: 04/28/2018 03:38 PM IST
Naa peru surya naa illu india trailer allu arjun goes on a rampage

‘క్యారెక్టర్ వదిలేయడం అంటే.. ప్రాణాలు వదిలేయడమే.. చావు రాకముందు చచ్చిపోవడమే’ అంటూ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేప్పిన డైలాగ్ తో వచన ‘నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా’ చిత్రంలోని డైలాగ్ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచింది. కొపం వచ్చినప్పుడు తనకు బూతులే వస్తాయని, మంత్రాలు రావంటూ చేసిన మరో డైలాగ్ యువ అభిమానులు వల్లే వేసేట్లుగా చేసింది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి.. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని రీరికార్డింగ్ పనులలో బిజీగా వున్న ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై భారీ అంచానాలను నిలిపింది. ఈ ఏడాది జనవరి 1న విడుదల చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ కు విశేష స్పందన లభించింది. ఆర్మీ అధికారిగా కనిపించిన అల్లు అర్జున్ తన స్టైల్‌, పాత్ర పట్ల అంకితభావంతో అభిమానులను కట్టి పడేశారు. ఇక ఇవాళ విడుదల చేసిన ట్రైయిలర్ అభిమానులకు డబుల్‌ ఇంపాక్ట్ ను తలపించి.

‘బిర్యానీ చాలా బాగుంది. రుచిగా ఉంది’ అని జైలులో ఉన్న ఖైదీ అంటే ‘ఇదే నీ ఆఖరి బిర్యానీ. ఇది తినేసరికి నిన్ను చంపేస్తా’ అనే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. యాక్షన్‌తో పాటు, ప్రేమ, కుటుంబం అనుబంధాలను మేళవించి సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చివర్లో శరత్ కుమార్‌ ‘నీకు ఏం కావాలి రా!’ అని అడిగితే ‘ఇండియా కావాలి. ఇచ్చేయ్‌’ అనే సంభాషణ ఆకట్టుకుంటోంది.

రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై శిరీషా- శ్రీధర్‌ లగడపాటి, బన్ని వాసులు నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విశాల్-శేఖర్ అందించిన గీతాలు ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శరత్ కుమార్‌, అర్జున్, బొమన్ ఇరానీ, రావు రమేష్‌, సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ నా పేరు సూర్య విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles