Star Producer Clarify Rumours on Sai Pallavi | సాయి పల్లవిపై రూమర్లు.. దిల్ రాజు ఏమని స్పందించాడంటే...

Dil raju condemns rumours on sai pallavi

Dil Raju, Sai Pallavi, MCA Movie, Dil Raju about Sai Pallavi, Dil Raju Interview, Sai Pallavi Rumours, MCA Movie Promotions, Nani Sai Pallavi Rumours

Few Days before rumours surrounded in Tollywood about Fidaa actress Sai Pallavi's behaviour. But, Producer Dil Raju recently clarifies that are trash.

సాయి పల్లవి రూమర్లను ఖండించిన దిల్ రాజు

Posted: 12/19/2017 03:15 PM IST
Dil raju condemns rumours on sai pallavi

దిల్ రాజు నిర్మించిన 'ఫిదా' చిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. ఈ సినిమా ‘మలార్’ సాయిపల్లవికి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చింది. దాంతో దిల్ రాజు తదుపరి చిత్రమైన 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సినిమాలో సాయిపల్లవికి చోటుదక్కింది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడుతూ, సాయిపల్లవి గురించి కొన్ని రోజులుగా జరుగుతోన్న ప్రచారం గురించి ప్రస్తావించారు. "ఈ సినిమా కోసం ఇచ్చిన కాల్షీట్లను సాయిపల్లవి ఎగ్గొట్టిందనే వార్తల్లో నిజం లేదు. ఆమె బిజీగా ఉండటం వలన కొన్ని డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. ఆ తరువాత తన కారణంగా షూటింగ్ ఆలస్యం కాకుండా సహకరించింది. ఇక ఆమె సమయానికి షూటింగ్ కి రాకుండా టీమ్ ను ఇబ్బంది పెట్టునట్టుగా కూడా రాశారు .. అందులోను నిజం లేదు. చెప్పిన సమయానికి ఆమె షూటింగ్ కి వచ్చేసేది.

ఇక 'శ్రీనివాస కల్యాణం' కథ విని సాయిపల్లవి చేయనందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అసలామె ఇంతవరకూ ఆ కథనే వినలేదు" అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే నానితో గొడవ గురించి మాత్రం దిల్ రాజు ఎక్కడా ప్రస్తావించకపోవటంతో అది మాత్రం నిజమేనని చెప్పుకుంటున్నారు.

సాయి పల్లవి-నాని గొడవ నిజమేనా?

ఫిదా బ్యూటీపై ఓ ఫేక్ న్యూస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles