No Exposing for Chances in my carrier Manjima Clarifies | ఛాన్సులు రాకపోయినా ఆ పని మాత్రం చెయ్యను!

Manjima mohan about exposing

Actress Manjima Mohan, Movie Offers, Manjima Mohan Expose, Manjima Mohan Controversy, Manjima Mohan Sexy Remarks, Manjima Mohan Movies, Manjima Mohan Upcoming Movies, South Actress Manjima Mohan

Actress Manjima Mohan clarifies on Exposing Remarks. She differs Expose and glamour different and she decided never goes exposing for movie chances.

ఎక్స్ పోజింగ్ ఎట్టి పరిస్థితుల్లో చెయ్యను : మాంజిమా మోహన్

Posted: 12/19/2017 03:45 PM IST
Manjima mohan about exposing

కెరీర్ ఎంత స్పీడుగా సాగిపోతే అంత మంచిదని హీరోయిన్లు ఇప్పుడు భావిస్తున్నారు. అందుకోసం కోందరు ఎందాకైనా తెగిస్తే.. అదే గ్లామర్ పరంగా షోకి ముందుకు వస్తుంటే.. మాలీవుడ్ బ్యూటీ మంజిమా మోహన్ మాత్రం ఆ పదానికి చాలా దూరం అని చెబుతోంది.

అనుభవం లేకుండానే వెంటపడుతున్నారా? ఇది కూడా చదవండి

‘ఒరు వడక్కం సెల్ఫీ’ ‘సాహసం శ్వాసగా సాగిపో’చిత్రాలతో సౌత్ లో అభిమానులను ఎక్కువే సంపాదించుకుంది. అంతకు ముందు మాలీవుడ్ లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలే చేసిందనుకోండి. ఇక కథానాయికగా ప్రస్తుతం తమిళ .. మళయాళ సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులో ఆమెకి ఛాన్సులు రాలేదు. అందుకు కారణం గ్లామర్ షోకి ఆమె దూరం అన్నది ఆమె చెబుతున్న కారణం.

Manjima Mohan Exposing

" గ్లామర్ గా కనిపించడం అంటే నా దృష్టిలో వేరే కోణం. కానీ, ఇతరులు ఆలోచించే విధానం వేరు. కథానాయికలు అందంగా కనిపించవలసిందే .. అయితే అది హద్దులు దాటనంతవరకే అనేది నా ఉద్దేశం. ఎక్స్ పోజింగ్ కి.. గ్లామర్ అనే పేరు తగిలించేస్తే చేయడానికి మాత్రం నేను సిద్ధంగా లేను. ఈ కారణంగా అవకాశాలు తగ్గుతాయనే సంగతి నాకు తెలుసు. కానీ ఫలానా పాత్ర మంజిమా చేస్తేనే బాగుంటుందనుకునే వాళ్లు వున్నారు. అందువలన నేను చేయదగిన పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తాయనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళ్, మళయాళంలో మూడేసి చిత్రాలతో బిజీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles