సాహో సెలక్షన్ ఎవరిదసలు? | Who was behind Saaho Casting Selection

Jackie shroff in part of saaho

Prabhas, Saaho Movie, Saaho Jackie Shroff, Bollywood Actors, Jackie Shroff Saaho, Jackie Shroff Prabhas Movie, Saaho Bollywood Caste

Bollywood actors Neil Nitin Mukesh, Chunky Pandey have been roped in to play negative roles in the movie and the latest news we hear is that veteran Bollywood actor Jackie Shroff will play the lead antagonist in the film.

సాహోలో జాకీష్రాఫ్... టోటల్ బాలీవుడ్ నటులేనా?

Posted: 08/19/2017 03:42 PM IST
Jackie shroff in part of saaho

ఐదేళ్ల తర్వాత 5 కోట్ల విలువ చేసే సెట్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో షూటింగ్ కు సిద్ధమైపోయాడు. సినిమాకు సంబంధించి కీలక వ్యవహారం అదేనండీ హీరోయిన్ ఎంపిక ఈ మధ్యే పూర్తి చేసేశారు కూడా. అయితే సినిమాకు సంబంధించి బాలీవుడ్ ఫ్లేవర్ రాను రాను ఎక్కువైపోతుండటంతో కొత్త ప్రశ్నలు ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ను వేధిస్తున్నాయి.

మ్యూజిక్ డైరక్టర్ మొదలు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, శ్రద్ధాకపూర్ ఇలా అంతా బాలీవుడ్ నటీనటులే ఉండగా, రీసెంట్ గా మరో సీనియర్ నటుడు జాకీఫ్రాఫ్ కూడా సాహో టీంలో చేరిపోయాడు. సాహో షూటింగ్ లో తాను ఓ పార్ట్ అవుతున్నందుకు చాలా సంతోషం. షూటింగ్ కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నా అంటూ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాకీ తెలిపారు. అయితే ఇప్పటికే ఉన్న నటీనటులు సరిపోరన్నట్లు ఇప్పుడు మళ్లీ ఇంకో నటుడిని ఎందుకు తీసుకున్నారన్నది అసలు ప్రశ్న.

స్టార్ డమ్ వచ్చినప్పటికీ స్టార్ల ఎంపిక విషయంలో ఓన్ ఛాయిస్ తీసుకునే అవకాశం ప్రభాస్ ఇంతవరకు తీసుకోలేదనే తెలుస్తోంది. ఇక డైరక్టర్ కొత్త వాడు కావటంతో ఆ ఛాయిస్ లేనే లేదన్నది మరో టాక్. నిర్మాతలు కూడా ప్రభాస్ కు సన్నిహితులు కావటంతో ఆ ఛాన్స్ చాలా తక్కువేనని చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన్న సినిమాకు కాస్టింగ్ సెలక్షన్ ఎవరన్నది మిస్టరీగా మారింది.

 

ఇట్స్ షో టైం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Movie  Jackie Shroff  

Other Articles

Today on Telugu Wishesh