ఈ మూడింటిలో అదృష్టం ఎవరిది? దురదృష్టం ఎవరిది? | Who is August Winner in Tollywood

Tollywood three releases which won

Nene Raju Nene Mantri First Week Collections, LIE Huge Loss, Jaya Janaki Nayaka Collections, Jaya Janaki Nayaka LIE Nene Raju Nene Mantri, August Movies First Week Collections, NRNM LIE JJN Winner

Nene Raju Nene Mantri (NRNM), Jaya Janaki Nayaka (JJN) and LIE have collected Rs 33 crore, Rs 27.50 crore and Rs 18 crore, respectively, at the worldwide box office in the first week.

మూడు సినిమాల్లో విక్టరీ దేనికి?

Posted: 08/18/2017 06:48 PM IST
Tollywood three releases which won

సెలవుల సీజన్ అంటూ వెనక్కి తగ్గకుండా టాలీవుడ్ లో గత వారం (ఆగష్టు 11న) మూడు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి. రానా 'నేనే రాజు నేనే మంత్రి' .. బెల్లంకొండ శీను 'జయ జానకి నాయక' .. నితిన్ 'లై' సినిమాలు థియేటర్లకి వచ్చాయి. వరుస సెలవులు రావడంతో థియేటర్లన్నీ కళకళ లాడుతూ కనిపించాయి. అయితే వసూళ్ల పరంగా చూసుకుంటే ఈ మూడు సినిమాల్లోచాలా తేడాలు కనిపించాయి.

సరిగ్గా వారం గడిచాక కలెక్షన్ల పరంగా నితిన్ లై చాలా దారుణంగా వెనుకబడిపోయి ఉంది. ఈ మూడింటిలో భారీ బడ్జెట్ మూవీ ఇదే అయినప్పటికీ లీస్ట్ సాధించేసింది. మైండ్ లాజిక్ మరీ ఓవర్ అయిపోవటంతో జనాలు అంతగా ఓన్ చేసుకోలేకపోయారు.ఇక రెండవ స్థానంలో బోయపాటి 'జయ జానకి నాయక' నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కావడం ఈ సినిమాకి కలిసొచ్చి 15 కోట్లు సాధించింది.

ఇక మిగిలింది రానా నేనే రాజు నేనే మంత్రి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం వారం రోజుల్లో 19 కోట్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రానా లుక్ .. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తొలిరోజు మిక్స్ డ్ టాక్ వినిపించినప్పటికీ మూడింటిలో రానా చిత్రానికే జనాలు క్యూ కట్టారు. అయితే ఈ వారం రిలీజ్ అయిన ఆనందో బ్రహ్మకు మంచి టాక్ రావటం, నెక్ట్స్ వీక్ వీఐపీ 2 బరిలో ఉండటంతో ఆ హవా తగ్గొచ్చనే చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nene Raju Nene Mantri  Jaya Janaki Nayaka  LIE  

Other Articles