నాని వర్సెస్ అఖిల్.. నష్టపోయేది ఎవరంటే... | Akhil Clash With Nani Confirm

Nani movie clash with akhil

Nani MCA, Akhil Second Movie, Nani Akhil, Nani Versus Akkineni Hero, December 21 and 22 Tollywood, Tollywood Movies in Christmas, Nani MCA Official Release Date, Akhil Second Movie Release Date

Nani MCA will complete all the formalities and will hit the screens on December 21st during Christmas.Nagarjuna himself is producing Akhil Second big budget romantic entertainer. Nag announced that the film will hit the screens during his favourite season of Christmas on December 22nd.

నాని-అఖిల్ పోటీ తప్పదా?

Posted: 08/19/2017 04:07 PM IST
Nani movie clash with akhil

నేచురల్ స్టార్ నాని తన హవాను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ యేడాది నేను లోకల్, నిన్ను కోరి అంటూ రెండు బ్లాక్ బస్టర్లు అందించిన నాని, ఇప్పుడు మూడో సినిమా ఎంసీఏను సిద్ధం చేస్తున్నాడు.

వేణు శ్రీరామ్ డైరక్షన్ లో ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి) రెడీ అవుతుండగా, సాయి పల్లవి నానికి జోడీగా నటిస్తోంది. షూటింగ్ ఓవైపు జెట్ స్పీడ్ తో సాగుతుండగానే సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు నిర్మాత దిల్ రాజు. డిసెంబర్ 21న ఎంసీఏ రిలీజ్ అంటూ చెప్పేశాడు. అయితే అదే రోజు మరో సినిమా నానితో క్లాష్ కి సిద్ధమైపోయింది.

అక్కినేని అఖిల్ రెండో చిత్రం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ సెంటిమెంట్ తో నాగార్జున ఈ సినిమాను కూడా ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 22న తెచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అఫీషియల్ గా నాగ్ స్వయంగా అనౌన్స్ చేయటంతో ఈ ఇద్దరిలో ఎవరు తగ్గుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే రెండు సినిమాలకు భారీగా బిజినెస్ జరిగే అవకాశం ఉండటంతో తేడా వస్తే నష్టపోయేది బయ్యర్లేనన్న విషయం గుర్తుంచుకుంటే మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  MCA Movie  Akhil  Vikram Kumar Movie  

Other Articles

Today on Telugu Wishesh