Prabhas Saaho Movie Official Teaser Released

Saaho official teaser out

Prabhas, Saaho Official Teaser, Saaho Teaser, Saaho Movie Telugu Teaser, Saaho Telugu Teaser, Saaho Teaser Released, Saaho Teaser Out, Stylish Saaho Teaser, Saaho Teaser Prabhas, Prabhas New Movie Teaser Out, Prabhas Next Teaser Out, Prabhas Saaho Teaser Review, Saaho Movie 2018

Prabhas new movie Saaho official teaser released. Young Rebel Star's Stylish entertainer under the DIrection of Sujeeth.

సాహో అఫీషియల్ టీజర్ రిలీజ్

Posted: 04/27/2017 05:47 PM IST
Saaho official teaser out

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త మూవీ సాహో టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ప్రభాస్ 19వ చిత్రంగా సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ ఎంటర్ టైనర్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. నిజానికి బాహుబలి 2 రిలీజ్ అంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్లలో దీనిని ప్రదర్శించాలని అనుకున్నారు. కానీ, లీకేజీ వ్యవహారంతో ముందుగానే రిలీజ్ చేసేశారు.

ఇక టీజర్ విషయానికొస్తే ముందే ఓపెన్ చేయగానే ఓ వ్యక్తి గ్లాస్ మీద పడి బద్ధలయిపోవటం, ఆ తర్వాత ఓ లేడీ స్విమ్మింగ్ చేస్తూ కనబడటం ఇలా మొదలైంది. ఆ రక్తం చూస్తేనే అర్థం అవుతుంది రా.. వాడిని చచ్చేలా కొట్టారని అనగానే, సార్ ఆ రక్తం మనోడిది అని పక్కనే మరో వాయిస్ చెప్పటం, ముఖం మీది రక్తం తుడుచుకుని మరీ ఇట్స్ షో టైం అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది.

 

 

చివర్లో ఓ బిల్డింగ్ మీద నుంచి రాకెట్లా లాంటి వాటితో ఇద్దరు ఎగిరిపోవటం చూస్తేంటే విజువల్ గా బాగా రిచ్ గా సినిమాను తెరకెక్కించబోతున్నారని అర్థమౌతోంది. రేపటి నుంచి బాహుబలి ది కంక్లూజన్ థియేటర్లలో ఈ టీజర్ ను ప్రదర్శించబోతున్నారు. తెలుగు, మళయాళం, తమిళ్ భాషల్లో ఈ టీజర్ విడుదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Saaho Movie  fficial Teaser  

Other Articles