director dasari narayana rao passed away దివికెగిన దర్శక దిగ్గజం.. దాసరి ఇకలేరు..

Director dasari narayana rao passed away

Dasari Narayana Rao, dasai narayana rao passed away, dasari demise, dasari no more, tollywood mourns for dasari, dasari ill health, dasari kims hospital, dasari hyper tension, dasari respiration, dasari passes away, Dasari Health, Dasari Critical Condition, Dasari Condition Serious, Dasari Again Surgery, Dasari Health Bulliten, Dasari Narayana Rao Serious, Dasari Health Bulliten

Formert Union minister, veteran tollywood director Dasari narayana rao passed away in kims hospital at hyderabad. tributes pour in from political and cinema celebrities

దివికెగిన దర్శక దిగ్గజం.. శోకసంధ్రంలో టాలీవుడ్

Posted: 05/30/2017 09:26 PM IST
Director dasari narayana rao passed away

మాజీ కేంద్ర మంత్రి దర్శకుడు దాసరి నారాయణ రావు ఇక లేరు అన్న వార్తను తెలుగు చలనచిత్రసీమ జీర్ణించుకోలేకపోతుంది. తెలుగు సినిమా రంగంలో పెద్దదిక్కుగా వున్న దాసరి కన్నుమూశారన్న వార్త టాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. గత నాలుగు రోజులుగా కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది జనవరిలో ఆయన అన్నవాహిక, మూత్రపిండాలు, వూపిరితిత్తుల్లో సమస్యలతో అస్వస్థతకు గురయ్యారు. శస్త్రచికిత్స అనంతరం మళ్లీ ఇన్‌ఫెక్ష్‌న్‌ సోకడంతో దాసరి నాలుగురోజుల క్రితం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం కిమ్స్‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దాసరి కన్నుమూశారు.

దాసరి నారాయణరావు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో 1942 మే 4న మహాలక్ష్మి, సాయిరాజ్ దంపతులకు జన్మించారు. నాటక రంగం నుంచి సినీ రంగ ప్రవేశం చేశారు. ‘తాతా మనవడు’ చిత్రంతో దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నటుడు, దర్శకుడు, నిర్మాతగా తన ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, వంటి అగ్రనటులతో సినిమాలు తీసిన దాసరి జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన ఎన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డగా ఎన్నో కీర్తి ప్రతిష్ఠలు అందుకున్నారు. ఆయనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్ ఉన్నారు.

దాసరి ప్రతిభను చాటిన అపురూప సినిమాలు

నటుడిగా కెరీర్ ఆరంభించిన దాసరి దర్శకుడిగా తనదైన ముద్రవేశారు. ‘తాత-మనవడు’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన ఆయన 150కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ‘దర్శకరత్న’ అనిపించుకున్నారు. ‘శివరంజని’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘ సందేశం’, ‘గోరింటాకు’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బలిపులి’ ‘ఒసేయ్ రాములమ్మ’ తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

దర్శకరత్న అందుకున్న కొన్ని అవార్డులు

దర్శకుడిగా తొలి చిత్రం ‘తాత-మనవడు’(1974)కు నంది అవార్డు.
‘స్వర్గం-నరకం’ చిత్రానికి బంగారు నంది.
‘మేఘ సందేశం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు(1982).
మామగారు చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు(1992).
ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ‘కళా ప్రపూర్ణ’ గౌరవ పురస్కారం
2007లో ఎన్టీఆర్‌ నేషనల్‌ అవార్డు.
2009లో శోభన్‌బాబు తొలి స్మార పురస్కారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasai narayana rao  demise  no more  tollywood  ill health  kims hospital  hyper tension  respiration  passes away  

Other Articles