Dasari Narayanarao Insulted by Make up Man

Dasari insulted by make up man

Dasari Narayarao, Dasari Insulted, Dasari Make Up Man, Dasari Expire, Dasari Death, Dasari Narayana Rao Death, Dasari Condolences, Celebs Condolence Dasari, Dasari Memories, Dasari Debut as Actor, Dasari Comedian Role

On First Day of his Debut Dasari Narayanarao insulted by Make up Man. And Character also changed in last minute.

దర్శకరత్నని ఫస్ట్ డే అలా అవమానించారా?

Posted: 05/31/2017 10:14 AM IST
Dasari insulted by make up man

ముఖానికి మేకప్ వేసుకునేందుకు ప్రతీ ఓడూ రైళ్లేక్కి చెన్నైకి వచ్చేయటమే... ఇది దాసరికి మేకప్ వేసిన వ్యక్తి మాట్లాడిన మాటలు. ఇంతలా అవమానం జరిగింది కాబట్టే ఆయన ఛాలెంజింగ్ గా తీసుకుని దర్శకరత్నగా ఎదిగిపోయాడు.

నిజానికి దాసరికి నటనలో ప్రవేశించాలన్న కోరిక బలంగా ఉండేది కాదంట. ఓపక్క ఉద్యోగం.. మరోపక్క ఖాళీ సమయంలో నాటకాలు మాత్రమే వేసుకుంటూ ఉండేవాడంట. అలాంటి సమయంలో ఓ సినిమా కోసం మెయిన్ కమెడియన్ రోల్ కు రమ్మని కృష్ణయ్య అనే స్నేహితుడు కబురు పంపాడంట. 'నీకన్నీ ఇలా కలిసి వస్తుంటాయి...మంచి అవకాశం వదులుకోకు, అన్నీ సర్దుకుని బయల్దేరు' అని స్నేహితులు చెప్పటంతో చెన్నైకి బయలుదేరాడంట.

ఫస్ట్ డే.. షూటింగ్... అక్కడ కృష్ణ అనే మేకప్‌ మేన్‌ దాసరిని చూసి ‘ప్రతివాడూ ఒక నాటకం వేసేయడం, ఒక కప్పు తెచ్చుకోవడం, కప్పొచ్చిన వెంటనే మద్రాసు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ లో దిగిపోవడం, సినిమాల్లో వేషం వేసేయాలనుకోవడం.. అసలెప్పుడైనా నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా?’ అని దారుణంగా ఈసడించాడు. అతను మరీ అంతమాట అనేసరికి షాక్ తినడం దాసరి వంతైంది. దీంతో తనలో ఉక్రోశం తన్నుకొచ్చిందని పలు సందర్భాల్లో ఆయన సంఘటనను గుర్తు చేసుకున్నాడు కూడా.

అంత చేస్తే ఆయనకు ఇచ్చింది కమెడియన్ పక్కన ఫ్రెండ్ రోల్ అంట. నాటకరంగంలో గోల్డ్‌ మెడలిస్ట్‌ , రాష్ట్రస్థాయి ఉత్తమనటుడు. అయినప్పటికీ ఆ ఫీలింగ్ ను చంపేసుకుని, సెట్ లోకి వెళ్లి ఆ సీన్ లో నటించేశాడు. ఆ అవమానమే ఆయన తర్వాత రోజుకు నాలుగైదు చిత్రాల్లో దర్శకత్వం వహించి, నటించే స్థాయికి చేర్చింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Make Up Man  First Day Shoot  

Other Articles