manchu manoj okkadu migiladu 2nd look poster released మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు..

Manchu manoj okkadu migiladu 2nd look poster released

manchu manoj birthday, manchu manoj okkadu migiladu, manchu manoj ltte prabhakaran, manchu manoj college student, okkadu migiladu 2nd look poster, manchu manoj, former LTTE militant, LTTE chief Prabhakaran, tollywood, entertainment

On the occasion of actor Manchu Manoj's birthday, the makers of upcoming movie 'Okkadu Migiladu' has released the actor's second looks poster.

మంచు మనోజ్ ఒక్కడు మిగిలాడు..

Posted: 05/20/2017 04:44 PM IST
Manchu manoj okkadu migiladu 2nd look poster released

మంచు మనోజ్ బర్తడే సందర్భాంగా 'ఒక్కడు మిగిలాడు' సినిమా నిర్మాణ సంస్థలు ఆయన సెకండ్ పోస్టర్ ను రిలీజ్ చేశాయి. పద్మజా ఫిల్మ్స్, న్యూ ఎంపైర్ సెల్యూలాయిడ్ సమర్పణలో ఎస్ఎన్ రెడ్డీ, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ఆయన పుట్టిన రోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అయితే ఈ చిత్రంలో శ్రీలంకను గడగడలాడించిన ఎల్టీలీఈ చీఫ్ ప్రభాకరన్ పాత్ర కోసం బరువు పెరిగిన మంచువారి అబ్బాయి.. నేటి తరం కాలేజీ కుర్రాడిలా చేస్తున్న మరో పాత్ర కోసం ఏకంగా 15 కేజీల బరువు తగ్గాడు. అజయ్ ఆండ్రుస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనీష్ అంబ్రోస్ కీలకపాత్రలో నటిస్తుంది. అమె ఈ చిత్రంలో జర్నలిస్టు పాత్రతో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి.

ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా వున్న ఈ చిత్రం త్వరలోనే వాటిని పూర్తి చేసుకోనుంది. కాగా జూన్ మొదటి వారంలో ఈ చిత్రానికి సంబంధించిన అడియో ఫంక్షన్ ను ఏర్పాటు చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు భావిస్తున్నాయి. ఇక వచ్చే నెలలోనే ఈ చిత్రం థియేటర్లను తాకనుంది. మరి మంచువారిబ్బాయికి మనమూ బెస్ట్ విషెస్ చెబుతామా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles