Srikanth's Ra Ra is ready for release విడుదలకు రెడీ అంటున్న శ్రీకాంత్ హరర్ కామెడీ..

Srikanth s next film ra ra a horror comedy is ready for release

srikanth, srikanth rara, srikanth chiranjeevi, chiranjeevi, nazia srikanth, srikanth nazia horror film, srikanth ra ra film, nazia ra ra, nazia horror comedy, srikanth news, tollywood news, entertainment news, tollywood, entertainment

'Ra Ra', a horror-comedy-thriller starring Srikanth in the lead role, was produced by Vijay, it's presented by Sreemitra Chowdhary. Nazia is the heroine

విడుదలకు రెడీ అంటున్న శ్రీకాంత్ హరర్ కామెడీ..

Posted: 05/20/2017 06:37 PM IST
Srikanth s next film ra ra a horror comedy is ready for release

ఒక వైపు యంగ్ హీరోల చిత్రాల ముఖ్యమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున కథానాయకుడిగా కూడా రాణిస్తూ శ్రీకాంత్ ఫుల్ బిజీగా వున్నాడు. నటన తనకు ప్రాణమని, నటించడం తన వృత్తి అంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న హీరో.. తన లేటెస్టు చిత్రంపై గంపెడాశలను పెట్టుకున్నాడు. శ్రీకాంత్ హీరోగా రూపొందిన చిత్రం 'రా రా' త్వరలో ధియేటర్లను తాకనుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గానాజియా నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జూన్ ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చిత్రనిర్మాణ వర్గాలు సన్నాహాలను కూడా చేస్తున్నాయి.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ,  ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..' ఇది హాస్యం తో కూడిన హర్రర్ ధ్రిల్లర్ చిత్రమని చెప్పాడు. తన కెరియర్లో చేసిన విభిన్నమైన చిత్రాల్లో ఇది ఒకటని అన్నాడు. తన కెరీర్ లోనే ఈ తరహా చిత్రం చేయడం మొదటిసారన్నాడు. మనుషులకు, దెయ్యాలకు మధ్య సాగే సరదా ఆటలు సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదాల తీరంలో విహరింప చేస్తాయి. 'రా..రా 'చిత్రానికి ప్రేక్షకుల ఆదరణకు అమితంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.   

మా హీరో, మిత్రుడు  శ్రీకాంత్ తో రూపొందిస్తున్న 'రా..రా'  చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవల మెగాస్టార్ విడుదల చేసిన చిత్రం మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన  లభించింది. ఈ నెలలోనే చిత్రం టీజర్ ను ఓ ప్రముఖ కథానాయకుడు చేతులమీదుగా విడుదల చేయనున్నాము. అలాగే చిత్రం ఆడియో వేడుకను విభిన్న రీతిలో జరుపనున్నాము.  అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని, వచ్చే నెలలో చిత్రంను విడుదల చేస్తున్నట్లు నిర్మాత విజయ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srikanth  nazia  horror comedy  chiranjeevi  tollywood  entertainment  

Other Articles