కెమెరామెన్ పై చేయిజారాడు.. కానీ కాదంటున్నాడు.. Case filed against Actor Arjun Rampal

Case filed against arjun rampal for alleged assaulting photographer

arjun rampal, arjun rampal attacks man, arjun rampal delhi case, arjun rampal tweet, arjun rampal denies attacking man, arjun rampal assault, case against arjun rampal, arjun rampal delhi, arjun rampal journalist, arjun rampal misbehave, entertainment news, bollywood updates

Arjun Rampal refuted all allegations of getting into a brawl and assaulting a man in Delhi. The actor took to Twitter and cleared air around the reports.

బాలీవుడ్ నటుడు చేయి జారాడు.. కేసులో చిక్కుకున్నాడు

Posted: 04/09/2017 11:42 AM IST
Case filed against arjun rampal for alleged assaulting photographer

ఉన్నత స్థాయిని అందుకోవడం ఎంత కష్టమో దానిని కష్టపడి అందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఉన్నతస్థానం అందుకోవడం కన్నా.. ఆ స్థానంలో కొనసాగడం కూడా కత్తిమీద సామేనన్న విషయం ఈ బాలీవుడ్ నటుడికి ఇప్పుడు తెలిసివచ్చింది. అది కూడా ఓ ఫొటోగ్రాఫ‌ర్‌పై దాడి చేసిన తరువాత. అందులోనూ ఈ బాలీవుడ్ నటుడిపై కేసు నమోదైన తరువాత. ఇంతకీ ఎవరా నటుడు ఏమా కథ అంటున్నారు కదూ.

అర్జున్ రాంపాల్.. మోడల్ గా రాణించి బాలీవుడ్‌లో హీరోగా మారిన రాంపాల్ అనంత‌రం నిర్మాతగానూ కొన్ని సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవ‌ల ఢిల్లీలోని జరిగిన ఓ కార్య‌క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. ఆయ‌న‌ వద్దని ఎంత చెబుతున్నా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీశాడు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలోని కెమెరాను తీసుకుని విసిరికొట్టాడు.

దీంతో అర్భున్ రాంపాల్ తనపై అకారణంగా దాడి చేసి, గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయపై కేసు న‌మోదు చేశారు. అయితే అర్జున్ రాంపాల్ మాత్రం తాను ఎవరిపై దాడి చేయలేదనే చెబుతున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా తాను ఎవరపై దాడి చేయలేదని చెప్పారు. కానీ కెమెరా విసిరిగొట్టిన విషయం నిజమా కాదా..? అన్నది మాత్రం స్పష్టం చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjun rampal  twitter  journalist  bollywood actor  entertainment news  bollywood updates  

Other Articles