అవన్నీ అసత్యాలంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు.. Nag's Shocking Comments on Balakrishna

Nag s shocking comments on balakrishna

Nagarjuna, Balakrishna, TSR TV9 Awards, nagarjuna balakrishna rumor, t subbiramireddy, TSR cultural foundation, chiranjeevi, tollywood

Two of the greatest actors of this generation Nagarjuna and Balakrishna have come on stage and clarified rumours that they share bad blood.

అవన్నీ అసత్యాలంటూ నాగార్జున క్లారిటీ ఇచ్చాడు..

Posted: 04/09/2017 08:43 AM IST
Nag s shocking comments on balakrishna

యువసామ్రాట్ నాగార్జున ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. గత కొంత కాలంగా అనేక రూమర్లకు కారణమైన విషయంపై ఆయన పెద్దవి విప్పారు. తనకు సినీన‌టుడు బాలకృష్ణ‌కు మధ్య ఎలాంటి విభేదాలు, గొడవులు లేవని చెప్పారు. విశాఖపట్నంలో టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్ నిర్వ‌హించిన జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో నాగార్జున, బాల‌య్య క‌లుసుకున్నారు. బాలకృష్ణ గ‌త ఏడాదికిగానూ ఉత్తమ కథానాయకుడి అవార్డు అందుకోగా, నాగార్జున ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నాగార్జున మాట్లాడుతూ... త‌నకు బాలకృష్ణకు మధ్య స్నేహం లేదని ఎన్నో పుకార్లు షికార్లు చేశాయని.. కానీ, అవ‌న్నీ అసత్యాలేన‌ని అన్నారు. విభేదాలు ఏమీ లేవని నాగ్ స్పష్టం చేశారు. ఇక ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కలవడంతో  నాగ్, బాల‌య్యల అభిమానుల అనందానికి అవధులు లేకుండా పోయాయి. టాలీవుడ్ అగ్రహీరోలిద్దరనీ ఒకే కార్య‌క్ర‌మంలో ఒకే వేదికపై కలిపిన ఘనత మాత్రం టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్ వీరిద్ద‌రినీ ఒకే వేదిక‌పై క‌లుసుకునేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles