ఆయనతో సినిమా తీసి తీరతా, నెక్స్ట్ మహాభారతం కాదంట | Rajamouli about Rajinikanth Movie.

Baahubali 2 tamil audio highlights

Rajamouli, Rajinikanth, Rajinikanth and Rajamouli, Rajamouli about Rajinikanth, Rajinikanth Rajamouli Movie, Baahubali 2 Tamil Audio Function, Rajamouli at Baahubali 2 Tamil Audio, Baahubali 2 Tamil Audio, Dhanush Baahubali 2 Audio, Suriya Dhanush Baahubali

Rajamouli clarity on next project after baahubali franchise. Also says that he was interested to do work with Rajinikanth in future.

బాహుబలి-2 తమిళ ఆడియో రిలీజ్ హైలెట్స్

Posted: 04/10/2017 09:08 AM IST
Baahubali 2 tamil audio highlights

బాహుబలి-2 తమిళ ఆడియో వేడుక ఆదివారం రాత్రి చెన్నైలో అట్ట హాసంగా సాగింది. నటుడు ధనుష్ ముఖ్యఅతిధిగా హాజరై ఆడియోను ఆవిష్కరించగా, బాహుబలి టీం మొత్తం స్టేజీపై సందడి చేసింది. ఈ కార్యక్రమానికి నటుడు, ఆర్జే బాలాజీ యాంకర్ గా వ్యవహిరించాడు. ఇక ఈ కార్యక్రమానికి కమల్ హాసన్ రావాల్సి ఉండగా, బిజీ షెడ్యూల్ తో తన స్నేహితుడు, దర్శకుడు అయిన రాజేష్ ను తన బదులు పంపించాడు. రజనీ కాంత్, విజయ్ లు హాజరవుతారని చెప్పినప్పటికీ అదంతా ఉత్తుతుదేనని తర్వాత తేలింది.

ఒక సినిమా కోసం ఐదేళ్లు కష్టపడటమే కాదు, దేశం మొత్తం తమ కష్టం గురించి మాట్లాడుకునేలా చేసిన ఘనత బాహుబలి టీందేనని హీరో ధనుష్ ప్రశంసలు కురిపించాడు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన తనకు ఈ యేడాది బాహుబలి-2 కోసమే జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న ఓ వార్త ఆశ్చర్యం కలిగించిందని, ఇది సౌత్ సినిమాకు దక్కిన గౌరవం అని పేర్కొన్నాడు.

ఇక తర్వాత మాట్లాడిన రాజమౌళి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా తీస్తానని ప్రకటించాడు. ప్రస్తుతం త‌న‌ మదిలో మాత్రం బాహుబలి తప్ప వేరే ఆలోచన ఏదీ లేదని, కానీ రజనీతో ఏదో ఒకరోజు సినిమా తీస్తాన‌ని పేర్కొన్నాడు. ఇక బాహుబలి సినిమా వెయ్యి సంవత్సరాల కిందట జరిగినట్లు చూపించే ఓ ఊహాజనితమైన కథ అని అన్నారు. ఇందులో యుద్ధ సన్నివేశాల్లో అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో ఊహించుకొని వాటినే చూపించామ‌ని రాజమౌళి చెప్పారు. బాహుబ‌లి-2లో పాత్రల మధ్య సంఘర్షణ కనపడుతుందని చెప్పారు.

బాహుబలి సిరీస్ ఇంతటితో ఆగిపోదని, సినిమాలోని పాత్ర‌లను మరింత బాగా వివరించేందుకు టీవీ సీరీస్‌, యానిమేషన్స్‌, ఇతర రూపకాల్లో కొనసాగిస్తామ‌ని రాజ‌మౌళి చెప్పారు. త‌న‌కు మహాభారతం తీయాలని ఎప్పటినుంచో ఉందని, తాను తీయడానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు ఆ విష‌యంపై చెబుతాన‌న్నాడు. సత్యరాజ్, నాజర్ లతో డిస్కషన్ల తర్వాత సెకండ్ పార్ట్ లో కోలీవుడ్ జనాలను మెప్పించే కొన్ని అంశాలను కూడా చేర్చినట్లు వివరించాడు. మొదటి పార్ట్ మాదిరిగానే రెండో పార్ట్ ను కూడా బిగ్గెస్ట్ హిట్ చేయాలని ఆశిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli  Baahubali 2  Tamil Audio  

Other Articles

Today on Telugu Wishesh