మాల్య విల్లాలో ఎంజాయ్ చేయనున్న హీరో Vijay Mallya's Villa sold to actor Sachiin Joshi

Vijay mallya s kingfisher villa sold to actor businessman sachin joshi

Kingfisher Villa, Vijay Mallya, Sachiin Joshi, Goa villa, Sachin joshi vijay mallya, vijay mallya sachin joshi, kingfisher villa sachin joshi, State Bank of India (SBI), Viking Media and Entertainment, Arundhati Bhattacharya

Vijay Mallya's famous Kingfisher Villa has finally been sold to actor-businessman Sachiin Joshi. lenders have agreed to dispose the property through a negotiated sale.

మాల్య కింగ్ ఫిషర్ విల్లాలో సచిన్ జోషీ

Posted: 04/08/2017 03:09 PM IST
Vijay mallya s kingfisher villa sold to actor businessman sachin joshi

ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు. అర్థిక నేరస్థుడైన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా గోవా విల్లాలో టాలీవుడ్ కు సుపరిచితుడైన హీరో ఎంజాయ్ చేయనున్నాడు. అదెలా అంటే ఎప్పటి నుంచి అమ్మకానికి పెట్టినా.. బిడ్డర్లు రాక.. ఏం చేయాలో తోచని స్థితిలో వున్న రుణదాతలకు.. దేవుడిలా కనిపించాడు ఆ హీరో. ఎందుకలా అంటే మాల్యాకు చెందని గోవా విల్లాను అతను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా హీరో అంటారా..? ఆయన మరెవరో కాదు సచిన్ జోషీ. అటు బాలీవుడ్ లోనూ పలు చిత్రాలలో నటిస్తున్న ఈ బిజినెస్ మెన్.. ఈ విల్లాను కొనేందుకు ముందుకు వచ్చాడు.

గోవాలో విజయ్ మాల్యాకు చెందిన విలాసవంతమైన కింగ్ ఫిషర్ విల్లాను రిజర్వ ధర 73 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తానికి కొనడానికి ముందుకొచ్చాడు. ఈ విషయాన్ని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్ పర్సెన్ అరుంధతీ భట్టాచార్య కూడా ధ్రువీకరించారు. మాల్యా రుణాలను రికవరీ చేసేందుకుగాను గోవాలోని దీన్ని వేలానికి ఉంచారు. కండోలిమ్‌లో అరేబియా సముద్రానికి ఎదురుగా వున్న ఈ విలాసవంతమైన విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి. దీనిపై అనేక మంది అసక్తి చూపినా చివరకి వరకు నిలవలేదు.

వేలంలో దక్కించుకునేందుకు కొందరు ఆసక్తి చూపినా రిజర్వ్ ధర చెల్లించేందుకు మాత్రం ముందుకు రాలేదు. దీంతో పలుమార్లు నిర్వహించిన వేలంలో రిజర్వ్ ధరను 85 కోట్ల నుంచి 81 కోట్లకు, చివరకు 73 కోట్ల రూపాయలకు తగ్గించారు. చివరకు ఈ విల్లాను సచిన్ జోషి సొంతం చేసుకున్నారు. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్‌ హోదాలో జోషి ఫిట్‌నెస్ సెంటర్ల నుంచి హెల్త్ స్పేష్ వరకు పలు రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles