హీరోయిన్లను బెడ్ రూమ్ కి రమ్మనటం కామనే... ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పలేదే! | Actress Kasthuri talked about casting couch.

Actress kasthuri shocking comments on film industry

Actress Kasthuri, Actress Kasthuri Sexual Harassment, Senior Actress Kasthuri, Kasthuri Shocking Comments, Kasthuri Film Industry, Kasthuri Senior Hero, Actress Kasthuri Children, Actress Kasthuri Husband, Casting Couch Harassment

Actress Kasthuri in a recent interview shares her views on Casting Couch In Film Industry.

ఫిల్మ్ ఇండస్ట్రీపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్

Posted: 03/13/2017 08:39 AM IST
Actress kasthuri shocking comments on film industry

90వ దశకంలో స్టార్ హీరోల సరసన మెరిసిన నటి కస్తూరి పెళ్లయ్యాక తెరపై కనిపించకుండా పోయింది. ఆ మధ్య డాన్ శీను లో మెరిసిన ఆమె తర్వాత ఓ రెండు మూడు బీగ్రేడ్ తరహా సినిమాలో కనిపించి కనుమరుగు అయిపోయ్యింది. అయితే సినిమాలు లేకున్నా సోషల్ మీడియాలో ఈ ఫార్టీ ఫ్లస్ ఆంటీ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. రీసెంట్ గా ఇండియాకు వచ్చిన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలే చేసింది.

కాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో దారుణంగా వేధిస్తారని ఆమె చెబుతోంది. అంతే కాదు అవకాశాల పేరుతో పడక గదికి రమ్మనే అలవాటు సినిమ పరిశ్రమలో ఉందనే విషయాన్ని నొక్కి వక్కానించారు. కొందరు నటీమణులు ఆలోచనా రాహిత్యంతో మాట్లాడతారు. మరికొందరు పారితోషికం డిమాండ్‌తో అవకాశాలను కోల్పోతారు. ఇంకొందరు సరైన నిర్ణయం తీసుకొవడంతో ఫెయిల్‌ అయ్యి నటిగా ఎదగలేకపోతారని అన్నారు. ఇక తన విషయంలో తాను ఆశించింది జరగకపోవడంతో తనను చిత్రాల నుంచి తొలగించారని చెప్పింది. అయితే దీని వెనుక ఓ హీరో ఉన్నాడంటూ బాంబు పేల్చింది. ప్రస్తుతం రాజకీయవాదిగా ఉన్న ఆయనగారికి ఈగో కూడా అధికం అని తెలిపింది.

అయినా తానా హీరోను గౌరవిస్తానని, అయితే ఆయనకు నో చెప్పడం నచ్చదని అన్నారు. ఆ హీరోతో తాను ఒక చిత్రంలో నటించానని, షూటింగ్‌ సమయంలో ఎప్పుడూ నాపై కోపం ప్రదర్శించేవారని తెలిపారు. ఆ తరువాత ఆయన రెండు చిత్రాల నుంచి తనను తప్పించారని చెప్పారు అన్న కస్తూరి ఆ నటుడెవరన్నది మాత్రం చెప్పలేదు. ఒక్కప్పుడు బిజీ నాయకిగా రాణించిన నటి కస్తూరి. ఆ తరువాత అమెరికాకు చెందిన డాక్టరును పెళ్లాడి అక్కడే సెటిల్‌ అయ్యారు. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురికి నృత్యం నేర్పించడానికి ఇటీవల చెన్నైకి వచ్చిన ఆమె ఇలా ఇంటర్వ్యూలు ఇస్తోంది. వరుసగా హీరోయిన్లు చేస్తున్న కామెంట్లు దుమారం రేపుతున్న  నేపథ్యంలో కస్తూరి కూడా స్టేట్ మెంట్ ఇవ్వటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి...

 

కోపరేట్ చేయకపోతే చాలా కష్టం

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Kasthuri Interview  Film Industry  Sexual Harassment  

Other Articles

Today on Telugu Wishesh