2.0 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్ Robo 2.0 Trailer Launch Date conformed

Robo 2 0 trailer launch date conformed

Shankar, RajiniKanth, Robo 2, 2.0, Robo 2.0 Trailer Launch Date, Robo 2.0 movie Trailer Launch Date, amy jackson, akshay kumar, robo 2,0 theaeical trailer, kollywood

The wait for the theatrical trailer of much-awaited '2.0' starring Rajinikanth, Akshay Kumar and Amy Jackson will end on September 29th this year.

2.0 థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ కన్ఫామ్

Posted: 03/12/2017 03:52 PM IST
Robo 2 0 trailer launch date conformed

అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా భారతీయ సినీ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో తెరకెక్కుతున్న సినిమా 2.0. రోబోకు సీక్వల్ గా రూపోందుతున్న ఈ చిత్రాన్ని క్రియేటివిటీకి పెట్టింది పేరైన దర్శక దిగ్గజం శంకర్.. సూపర్ స్టార్ రజనీకాంత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి 400 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించగా, రమారమి అంతా వెచ్చించారని కూడా టాక్. ఇక చిత్ర నిర్మాణానికి వస్తే కేవలం ఒక పాట మినహా మిగతా భాగం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం.

సినిమా పోస్టు ప్రోడక్షన్స్ వర్కుతో పాటు గ్రాఫిక్స్ కోసం మరో నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుందని కూడా కోలీవుడ్ వర్గాలు ద్వారా తెలుస్తుంది. ఈ క్రమంలో భారతీయ సినీ రంగంలోనే ఈ చిత్ర నిర్మాణ వ్యయం చర్చనీయాంశంకాగా, చిత్రం ఎలా వుండబోతుందన్న ఉత్కంఠ కూడా అభిమానుల్లో పెద్ద స్థాయిలో నెలకోంది. అందుకుగాను ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదలైతే కాని అంచనాల గురించి అప్పుడే ఏమీ చెప్పలేమని కూడా సినీవిశ్లేషకులు చెబుతున్నారు. హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో రూపొందుతున్న తరుణంలో రోబో 2.0 ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ డేట్ను కన్ఫామ్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్న రోబో 2 అఫీషియల్ ట్రైలర్ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాణాంతర కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అందుకే షూటింగ్ తరువాత 6 నెలలకు పైగా సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్కే కేటాయించారు. ట్రైలర్ రిలీజ్ అయిన నెల తరువాత అక్టోబర్ లో దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shankar  RajiniKanth  Robo 2  2.0  Robo 2.0 Trailer Launch Date  kollywood  

Other Articles