ప్రభాస్ బట్టల డొనేషన్.. ప్రమోషన్ లో భాగం కాదంట! ఇంతకీ ఏం చేయబోతున్నాడంటే... | Prabhs ready to donate his old clothes.

Prabhas donate his costumes to lady fans

Actor Prabhas, Prabhas Clothes, Prabhas Lady Fans, Actor Prabhas Memories, Hero Prabhas Donation, Prabhas New Look, Prabhas Sujith Movie Look, Prabhas Baahubali Costumes, Prbhas Mister Perfect, Prabhas Weight Loss

Actor Prabhas to Give Away Everything to Fans. After weight loss he donates all his clothes to lady fans.

లేడీ ఫ్యాన్స్ కోసం ప్రభాస్ డొనేషన్

Posted: 03/13/2017 10:01 AM IST
Prabhas donate his costumes to lady fans

సినిమా కోసం ప్రాణం పెట్టి తన ఫిజికల్ అండ్ బాడీ లాంగ్వేజ్ లో సమూలంగా మార్పులు చూపించే అమీర్ ఖాన్ ను మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ గా అభివర్ణిస్తుంటారు. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ప్రభాస్ ను అలాగే చెప్పుకుంటున్నారు అతని అభిమానులు. దాదాపు సినిమా సినిమాకు బాడీని హుళం చేసుకుని మారిపోయే ప్రభాస్ కు ఆ ట్యాగ్ లైఫ్ ఫర్ ఫెక్ట్ గా ఉంటుందన్నదే వారి అభిప్రాయం కూడా. ఇక ఇప్పుడు బాహుబలి నుంచి సెలవు తీసుకున్న డార్లింగ్ సుజిత్ సినిమా కోసం మరోసారి స్లిమ్ అయ్యే పనిలో పడ్డాడు.

రాజమౌళి రిక్వయిర్ మెంట్ కోసం ఆల్ మోస్ట్ 100 కేజీలకు పైగానే బరువు పెరిగిన ప్రభాస్ ఇప్పుడు మరి ఓ 30 కేజీల దాకా తగ్గే పనిలో పడ్డాడంట. ఆ లెక్కన కొవ్వు కరిగి స్టైలిష్ రూపానికి సరిపోయే ఫిజిక్ కు వచ్చేయాలని రాత్రిబవంళ్లు తెగ కృషి చేస్తున్నాడు. మరి ఆపై సైజు అయిన బట్టలను ఏం చేయబోతున్నాడన్నది అసలు మ్యాటర్. ఈ నాలుగేళ్లలో తాను వాడిన బట్టలను ప్రభాస్ దానం చేయబోతున్నాడంట.

సాధారణంగా ఇలా భీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడ్డ హీరోలు తమ దుస్తులను వేలం వేసి చిన్న చిన్న ట్రస్ట్ లకు డొనేట్ చేస్తుంటారు. కానీ, ప్రభాస్ మాత్రం తనకున్న లేడీ ఫాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని ఫ్రీగా వారికి తన బట్టలను ఇచ్చేందుకు సిద్ధమైపోయాడు. ఏప్రిల్ 28న బాహుబలి2 రిలీజ్ అయ్యాక ఈ పని జరుగుతుందట. మరి ఈ హ్యాండ్ సమ్ హంక్ జ్నాపకాలను పదిల పరుచుకోవాలనుకునే అమ్మాయిలు ఎలా ఎగబడిపోతారో చూడాలి మరి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor Prabhas  Clothes Donation  Lady Fans  

Other Articles

Today on Telugu Wishesh