కో-ఆపరేట్ చేయకపోతే బతకలేం.. స్టార్ డైరక్టర్లు కూడా నన్ను అప్రోచ్ అయ్యారు.. టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్లు | Actress Madhavi Latha Reveals Shocking facts about Tollywood.

Actress madhavi latha sensational comments on tollywood

Actress Madhavi Latha, Madhavi Latha, Madhavi Latha Shocking Comments, Madhavi Latha Tollywood, Tollywood Madhavi Latha, Tollywood Actress Harassment, Tollywood Actress Madhavi Latha

Actress Madhavi Latha Reveals Shocking Truth About Telugu Film industry. This telugu girl has clearly said the position of the heroines in the film industry. What she said might be true, but most of the heroines might not agree for that. The actress spoke about the harassment that happens in the film industry where the directors or the producers indirectly try to exploit her. This might be one reason for why many Telugu speaking girls are avoiding the film industry.

టాలీవుడ్ పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Posted: 03/03/2017 04:58 PM IST
Actress madhavi latha sensational comments on tollywood

ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో భావన ఉదంతం తర్వాత ఒక్కో హీరోయిన్ బయటపెడుతూ వస్తున్నారు. ఒక్కోసారి తమ రేంజ్ కూడా ఆలోచించకుండా తీవ్ర ఇబ్బందులకు కూడా గురిచేస్తుంటారని, ఇప్పుడది చాలా కామన్ గా మారిపోయిందని నగ్మా లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా చెప్పటం చూస్తే ఈ పరిస్థితి ఇప్పటిదేం కాదని స్నప్టంగా తెలుస్తోంది.

అయితే సిల్వర్ స్క్రీన్ పై ఎదురయ్యే ఇబ్బందులు, వేధింపులు ఎలా ఉంటాయన్నది దాన్ని చాలా ఓపెన్ గా చెప్పేసింది హీరోయిన్ మాధవీలత. రవిబాబు నచ్చావులే తో హీరోయిన్ గా మారిన ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలో ప్రస్తుతం నటీమణుల బతుకు ఎంత దారుణంగా ఉందో వివరిస్తోంది. టాప్ ప్రొడ్యూసర్లు.. డైరెక్టర్లు కూడా తక్కువేం కాదని.. ‘‘మనం క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉండలేమా?’’ అంటూ ఇండైరక్ట్ గా అప్రోచ్ అయ్యేవారంటూ చెబుతోంది. ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే...

ఒకవేళ తాను పాజిటివ్ గా రియాక్ట్ కాకపోవటంతో వేధింపులకు దిగేవారని అంటోంది. చెట్ల కింద మేకప్ వేయించటం.. హోటల్ రూం మార్చేయటం.. అందరి ముందు ఛండాలంగా తిట్టేయటం.. బండబూతులు తిట్టటం లాంటివి చేస్తుంటారని వెల్లడించింది. కో-ఆపరేట్ చేయకపోతే బతకలేం మాధవీలత అని చెప్పినోళ్లు చాలామందే ఉన్నారని.. టాలెంట్ ఎవడికి అక్కర్లేదంటూ కుండ బద్ధలు కొట్టేసింది. ఓ స్టార్ సెలబ్రిటీ తనను ఏవిధంగా వేధించాడో చెప్పిన ఆమె తర్వాత తన ఫ్యామిలీని ఇబ్బందుల్లోకి నెట్టాడని వివరించింది కూడా.

‘‘వారు నాకు వారం టైమిచ్చాడు. ఒప్పుకోకపోతే వీక్ ఫాయింట్ మీద కొడతా అన్నాడు. వారం తర్వాత నా కుటుంబానికి ఊహించనంత పెద్ద సమస్య వచ్చింది. ఆరోజు నాకింకా గుర్తు. మా నాన్న ఫోన్ చేసి ఏడ్చారు. నేను ఏమైనా ఫర్వాలేదు. కానీ, వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ, తర్వాత ఓ పెద్దాయన జోక్యం ఆ వ్యవహారం సమసింది. నేను గనుక నోరు తెరిస్తే ఇండస్ట్రీలో ఎంతో మంది కాపురాలు కూలిపోతాయంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చింది మాధవీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Madhavi Latha  Tollywood  Shocking Comments  

Other Articles