బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్న మెగా ‘ఖైదీ’ khaidi no 150 collects 100 cr share

Khaidi no 150 collects 100 cr share

Chiranjeevi, Khaidi no. 150, Baahubali, khaidi no 150 box office collections, 100 cr club, fastes grosser mark, record collections, khaidi collections, chiru movie collections, Box office collections, South film industry, Tollywood

Chiranjeevi’s comeback film after eight years — Khaidi No 150 — became the fastest grosser to hit the Rs 150 crore mark in collections in Tollywood. As per industry sources, the film earned Rs 150 crore in a fewer number of days than even Baahubali.

బాక్సాఫీసు కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్న మెగా ‘ఖైదీ’

Posted: 01/29/2017 03:53 PM IST
Khaidi no 150 collects 100 cr share

రమారమి దశాబ్ద కాలం తరువాత మరోమారు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ఖైదీ నంబర్ 150తో బాక్సాఫీసు వద్ద రికార్డులను తిరగరాసుకుంటున్నాడు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల ఈ చిత్రం అతికొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో రికార్డ్లను క్రియేట్ చేసింది. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అందుకనే పట్టుమని పద్దెనిమిది రోజులు కూడా నిండకుండానే ఈ చిత్రం అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ చిత్రం 150 కోట్ల రూపాయల గ్రాస్ అదాయాన్ని సమకూర్చుకుంది. టాలీవుడ్ రారాజుగా ముద్రవేసుకున్న చిరంజీవి తన రీ ఎంట్రీతో మరోమారు బాక్సాఫీస్ మీద తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ జనరేషన్ హీరోలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న భారీ కలెక్షన్ రికార్డ్లను సైతం మెగాస్టార్ ఈజీగా అందుకున్నాడు.

సౌత్లో వందకోట్ల సినిమాలు గతంలోనూ ఉన్నా.., చిరంజీవి ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు సౌత్లో వందకోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నా, అవన్ని రెండు, మూడు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయి ఆ రికార్డ్ను సాధించాయి.. కానీ కేవలం ఒక్క భాషలోనే రిలీజ్ అయి వందకోట్ల క్లబ్లో చేరిన సినిమాలు మాత్రం చాలా అరుదు అలాంటి అరుదైన రికార్డ్ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగాస్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles