బాలీవుడ్ కమాండో-2 చిత్రంపై తారక్ ట్విట్ jr. ntr tweets on bollywood movie commando-2

Jr ntr tweets on bollywood movie commando 2

jr ntr, nt rama rao jr, tarak, tollywood, tweet, Vidyut Jammwal, Adah Sharma, Esha Gupta, Vipul Amrutlal Shah, Vipul Shah, 3rd March 2017, Action Film, Top Bollywood Trailers 2017, Force 2, Commando, bollywood

jr ntr, nt rama rao jr, tarak, tollywood, tweet, Vidyut Jammwal, Adah Sharma, Esha Gupta, Vipul Amrutlal Shah, Vipul Shah, 3rd March 2017, Action Film, Top Bollywood Trailers 2017, Force 2, Commando, bollywood

బాలీవుడ్ కమాండో-2 చిత్రంపై తారక్ ట్విట్

Posted: 01/29/2017 02:31 PM IST
Jr ntr tweets on bollywood movie commando 2

అభిమానులతో పాటు అయిన వాళ్లతో మాట్లాడాలన్న నేటితరం అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియానే అశ్రయిస్తున్నారు. ఎంత మంది ఫాలోవర్స్ వున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. వున్నఅభిమాన లోకానికి తమ ఎప్పటి సంగతులు అప్పుడే చెప్పే అవశామున్న సోషల్ మీడియాలోకి ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు తమ విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ కోవాలో చేరి.. సోషల్ మీడియాలో కూడా తమ సత్తా చాటుకుంటూ యాక్టివ్ గా ముందుకు దూసుకెళ్తున్నవారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. ఇటీవల తన బాబాయ్ బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సంబంధించి అనేక ట్వీట్లు చేసిన ఆయన.. తాజాగా ఒక నటుడి గురించి ట్వీట్ చేశాడు. తనతో పాటు రెండు మూడు సినిమాల్లో నటించిన(విలన్ పాత్రలో) విద్యుత్ జమాల్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ఓ ట్వీట్ చేశాడు తారక్.
 
విద్యుత్ జమాల్ బాలీవుడ్‌లో కమాండో-2 అనే సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇందులో ఆదాశర్మ(హర్ట్ ఎటాక్ ఫేం) కూడా నటిస్తుండడంతో ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా తారక్ హీరోకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. 'నా స్నేహితుడు విద్యుత్ జమాల్ కమాండో 2 తెలుగులో వస్తోంది. అతడికి ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశాడు. అంతేకాదు ఆ సినిమా ట్రైలర్‌ను కూడా షేర్ చేశాడు తారక్. ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jr ntr  vidyut jammwal  commando 2  black money  trailer  bollywood  

Other Articles

Today on Telugu Wishesh