చై-శామ్ అఫీషియల్ గా ఒకటయ్యారు | Samantha and Naga Chaitanya Engagement completed.

Naga chaitanya and samantha engaged

Naga Chaitanya, Samantha Ruth Prabhu, Naga Chaitanya and Samantha Ruth Prabhu, Samantha Engagement, Samantha, Naga Chaitanya to get engaged, Nagarjuna Shares Engagement

Naga Chaitanya and Samantha Engaged; Father Nagarjuna Shares Photos.

ఘనంగా చైతూ, సమంత ఎంగేజ్ మెంట్‌

Posted: 01/30/2017 08:51 AM IST
Naga chaitanya and samantha engaged

టాలీవుడ్, ప్రేక్షకులు, మీడియా ముఖ్యంగా అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అక్కినేని వారసుడు నాగచైతన్య, స్టార్ హీరోయిన్ లు సమంతల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొంత మంది బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగ్ తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్లో రాసుకొచ్చారు కింగ్ నాగార్జున. మా అమ్మ నా కూతురు అయిందని పేర్కొన్న నాగ్‌.. సమంత, చైతూకు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుగుతున్న ఫొటోను షేర్ చేసుకున్నాడు. చై సమంత.. సుదీర్ఘ కాలం నుంచి ఫ్రెండ్స్ అండ్ లవర్స్ అన్న విషయం తెలిసిందే.

గత ఆరు నెలల క్రితం దోచుబుచులాడిన ఈ జంట ఆ తర్వాత మెల్లగా లీక్ చేయటం, ఆపై నాగ్ వీళ్ల పెళ్లికి ఒప్పుకోవటం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం చిన్న తనయుడు అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగిపోగా, ఇప్పుడు వీళ్ల లవ్ స్టోరీ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైపోయింది. ఇక వీళ్లిద్దరి మతాలు వేరు కావటంతో ఇటు హిందూ సంప్రదాయాలతో పాటు అటు క్రైస్తవ పద్ధతులతో సహా ఎంగేజ్మెంట్ జరగడం విశేషం.

చర్చ్ ఫాదర్ ఇద్దరి నిశ్చితార్ధాన్ని దగ్గరుండి జరిపించగా.. ఆ తర్వాత హిందూ సంప్రదాయాల ప్రకారం బొట్టు పెట్టించుకుని మరీ హోమం చేసేసింది సమంత. మరి కొన్ని నెలల్లో జరగనున్న పెళ్లి కూడా ఇలాగే రెండు రకాలుగా జరగనుందనే టాక్ ఇప్పటికే ఉంది. మొదట చెన్నైలో క్రిస్టియన్ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హిందూ ట్రెడిషన్స్ ప్రకారం పెళ్లి చేసుకోనున్నారట. ఈ రెండింటికీ ఎక్కువమందినీ పిలవకపోయినా.. ఆ తర్వాత జరిపే రిసెప్షన్ కి మాత్రం మొత్తం ఇండస్ట్రీ జనాలను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం #chaisam చైస్యామ్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా చక్కర్లు కొడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Naga Chaitanya  Akkineni Nagarjuna  

Other Articles

Today on Telugu Wishesh